Bigg Boss Telugu 9 Day 34 Promo Review: బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్, కామనర్స్ మధ్య టాస్కులు, సరదా గేమ్స్, సీరియస్ డిస్కషన్స్ కొనసాగుతున్నాయి. తాజా ఎపిసోడ్‌లో కింగ్ నాగార్జున న్యూ మాస్ లుక్‌లో అదరగొట్టారు. కంటెస్టెంట్స్‌లో జోష్ పెంచుతూనే గత వారం టాస్కులు, గేమ్స్‌లో తప్పులు చేసిన వారికి క్లాస్ తీసుకున్నారు నాగ్.

Continues below advertisement

తనూజకు నాగ్ క్లాస్

'బెడ్ టాస్క్‌లో నువ్వు ఆడిన తీరు కరెక్టేనా?. ముందు ఆడపిల్లలందరినీ బెడ్ పై నుంచి తోసేద్దాం అనుకున్నావ్. అలాంటప్పుడు నువ్వు అందరి తరఫున పోరాడి ఉండుంటే చివరకు నీ వరకూ వచ్చేది కాదు కదా?. సంజన మీరంతా కలిసి ఆడండి విడివిడిగా నిల్చోవద్దు అని చెప్తుంది. అప్పుడైనా నీకు సెన్స్ రావాల్సింది కదా?' అంటూ నాగ్ ప్రశ్నించారు. 'భరణి, ఇమ్మాన్యుయెల్, కల్యాణ్ ముగ్గురూ నిన్ను తియ్యరు అనుకున్నావా?' అని అడగ్గా... తనూజ షాక్ అయ్యారు. 

Continues below advertisement

ఇక దివ్యను ఉద్దేశించి... 'భరణి శ్రీజను అలా లాగేయడం ఫెయిరా' అంటూ ప్రశ్నించగా... 'ఎవరి బాండ్ బట్టి వారు అలానే చేస్తుంటారు సార్' అంటూ దివ్య చెప్పగా... 'అయితే తనూజ ఉంటే ఓకేనా?, ఒకవేళ దివ్య, తనూజ ఉంటే భరణి ఏం చేసేవారు?' అని నాగ్ ప్రశ్నించారు. అప్పుడు 'భరణి తనూజకే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే నేను అర్థం చేసుకుంటాను' అని దివ్య చెప్పగా... తనూజ అర్థం చేసుకోదా? అంటూ నాగ్ ప్రశ్నించడంతో దివ్య సైలెంట్ అయిపోయారు. ఫ్లోరా కూడా సెల్ఫిష్‌గానే గేమ్ ఆడారంటూ నాగ్ చెప్పారు.

Also Read: బిగ్‌బాస్ డే 33 రివ్యూ... వరస్ట్ ప్లేయర్ to కెప్టెన్సీ బ్యాండ్ వరకు కళ్యాణ్... దివ్యకు తనూజ వెన్నుపోటు... ఇమ్మూను బకరాను చేసిన హీరోయిన్

డేంజర్ జోన్‌లో భరణి

ఇక ఆ టాస్కులో తాను స్వార్థంగానే వ్యవహరించానని... అది తన తప్పేనంటూ భరణి చెప్పగా... నాగ్ క్లాస్ తీసుకున్నారు. 'ఎంతో ఎదగాల్సిన నువ్వు బెడ్ మీద నుంచి కాదు మా దృష్టిలో కూడా కింద పడ్డావ్. వారంలో తప్పులు చేసి వీకెండ్‌లో ఒప్పుకుంటే కుదరదు. నీకు స్పష్టంగా అర్థం కావడం కోసం యూకే నుంచి వచ్చిన అమ్మాయి చెప్తుంది.' అంటూ నాగ్ క్లాస్ తీసుకున్నారు. ఇంతలో ఆడియన్స్‌లో ఓ అమ్మాయి... 'సార్ మీ గేమ్ కనపడడం లేదు. బాండింగ్స్ కనపడుతున్నాయి. అసలు మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్‌లో నిజంగా ఉంచబుద్ది కావడం లేదు.' అంటూ చెప్పడంతో భరణి డేంజర్ జోన్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది.

వెపన్ 'పవరాస్త్ర'

ఇక బెలూన్ టాస్క్, స్విమ్మింగ్ పూల్ టాస్కులకు సంబంధించి సుమన్ శెట్టి, రాము రాథోడ్‌లకు క్లాస్ తీసుకున్నారు. బెలూన్ టాస్కులో రీతూ బ్రిలియంట్ స్ట్రాటజీ ప్లే చేశారని... ఆమె తప్పులను ఎత్తిచూపారు. తనను చూసి మిగిలిన కంటెస్టెంట్స్ అదే పద్ధతిలో ఆడారని అన్నారు. 'తాను ఇమ్మాన్యుయెల్, సంచాలక్‌ను అడిగాను.' అంటూ చెప్పడంతో... తాను ఆడొచ్చు, ఆడలేదు అని ఏం చెప్పలేదని మీ గేమ్ మీరు ఆడాలని మాత్రమే చెప్పానని ఇమ్మూ చెప్పడంతో రీతూ కార్నర్‌లో పడిపోయారు. కంటెస్టెంట్స్ ఆటలో ముందుకు వెళ్లాలంటే ఆయుధం కావాలంటూ 'పవరాస్త్ర'ను ఇంట్రడ్యూస్ చేశారు. దీంతో గేమ్ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది.