Telangana Congress : పరువు నష్టం కేసులో కింది కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టు ఖరారు చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. గుజరాత్ రాష్ట్రంలో ఉన్నవి కోర్టులా లేక బీజేపీ కార్యాలయాలా అని ప్రజలు చర్చించుకుంటున్నారని మండిపడ్డారు. కోర్టు తీర్పు తర్వాత కరీంనగర్‌లో ర్యాలీ నిర్వహించిన ఆయన కోర్టులపై ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారికి వచ్చిన ఆధరణను చూసి ఓర్వలేక, అలాగే పార్లమెంట్ లో అదానీ గురించి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అక్రమంగా కేసులు వేయించి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేశారని ఆరోపించారు.
రాహుల్ గాంధీని ప్రధానమంత్రి మోదీ లక్ష్యంగా చేసుకుని వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ర్యాలీలు నిర్వహించింది. పలుచోట్ల దిష్టిబొమ్మలను దహనం చేశారు.
పరువు నష్టం కేసులో తనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ గుజరాత్ హైకోర్టులో సవాల్ చేసినా ప్రయోజనం లేకపోయింది. "రాహుల్ గాంధీపై 10కిపైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దోషిగా తేలిన కేసు తర్వాత కూడా పలు కేసులు దాఖలయ్యాయి. వీర్ సావర్కర్ మనవడు కూడా కేసు వేశారు. ఏదిఏమైనా.. మోదీ ఇంటి పేరు వివాదంలో పడిన శిక్షతో రాహుల్ గాంధీకి అన్యాయం జరిగింది అనడానికి ఏం లేదు! ఈ తీర్పు సరైనదే. సూరత్ కోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు " అని గుజరాత్ హైకోర్టు తీర్పునిచ్చింది.
2024 లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాహుల్ గాంధీపై గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ కు కూడా షాక్ తగిలినట్టు అయ్యింది. ఏదైనా కేసులో దోషిగా తేలితే, సంబంధిత వ్యక్తి 8ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిబంధనల్లో ఉంది. అలాంటిది.. 2024 ఎన్నికల వేళ రాహుల్ గాంధీ పోటీ చేయకపోతే ఎలా? అని కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. హైకోర్టు తీర్పుపై ఇప్పుడు రాహుల్ గాంధీకి ఒక్కటే ఆప్షన్ మిగిలింది. అదే సుప్రీంకోర్టుకు వెళ్లడం . సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకుని రెండేళ్ల జైశిక్షపై స్టే తెచ్చుకుంటే తప్ప.. ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు.