Congress leader Madhuyashki collapses in the Secretariat: కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ సచివాలయంలో కుప్పకూలిపోయారు. మంత్రి శ్రీధర్ బాబును కలిసేందుకు సెక్రటేరియట్ కు వచ్చిన ఆయన ఒక్క సారిగా స్పృహతప్పి పడిపోయారు. పరిస్థితి సీరియస్ గా ఉండటంతో సిబ్బంది వెంటనే అంబులెన్స్ ద్వారా ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితిపై కాసేపట్లో బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది.
Madhu Yashki: మధుయాష్కీకి తీవ్ర అస్వస్థత - సచివాలయంలో కప్పకూలిపోయిన నేత - ఏఐజీలో అత్యవసర చికిత్స
Raja Sekhar Allu | 16 Sep 2025 05:42 PM (IST)
Madhuyashki collapses : కాంగ్రెస్ నేత మధుయాష్కీ సచివాలయంలో ఒక్క సారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను సిబ్బంది ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.
ఏఐజీ ఆస్పత్రిలో మథుయాష్కీకి చికిత్స