TS Congress : ఎమ్మెల్యేలను కొనుగోలు చేయబోయారంటూ ముగ్గురు వ్యక్తులపై ఏసీబీ పెట్టిన కేసు , సెక్షన్లు సీఎం కేసీఆర్‌కూ వర్తింప చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేత బక్కా జడ్సన్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. 1988 అవినీతి నిరోధక చట్టం కాంగ్రెస్ నుండి తెరాస లో చెరిన విషయంలో కేసీఆర్‌కు ఎందుకు వర్తించదని బక్కా జడ్సన్ ప్రశ్నించారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రెక్కల కష్టం తో కాంగ్రెస్ పార్టీ గుర్తు పై గెలిచిన పన్నెండు మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ ప్రలోభపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని జడ్సన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీ నాయకులు 4 తెరాస ఎమ్ఎల్ఏ లకు ప్రలోబాపెట్టినందుకు 1988 అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్టుగా కెసిఆర్ పై కుడా అదే చట్టం కింద ఇంట్రగేషన్ చెయ్యాలని ఫిర్యాదు చేసాము. తెరాస ఎమ్ఎల్ఏ లకు ప్రలోభ పెట్టినందుకు బీజేపీ నాయకుల పై పెట్టిన కేసు ముఖ్యమంత్రి కెసిఆర్ కు అదే చట్టం వర్తించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన పన్నెండు మంది ఎమ్మెల్యేల జాబితాను కూడా బక్కా జడ్సన్ తన ఫిర్యాదుకు జత చేశారు.
1) చిదమర్తి లింగయ్య నక్రేకల్ అసెంబ్లీ,
2)గండ్ర రమణారెడ్డి భూపాలపల్లి అసెంబ్లీ,
3) హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ అసెంబ్లీ,
4) ఉపేందర్ రెడ్డి పాలేరు అసెంబ్లీ ,
5) రేగా కాంత రావు పినపాక అసెంబ్లీ,
6) హరిప్రియ నాయక్ ఇలాందు అసెంబ్లీ,
7) తాండూరు అసెంబ్లీ రోహిత్ రెడ్డి,
8) ఎల్లారెడ్డి అసెంబ్లీ జాజుల సురేందర్,
9) కొత్తగూడెం అసెంబ్లీ వనమా వెంకటేశ్వరరావు,
10) మహేశ్వరం అసెంబ్లీ సబితా ఇంద్రారెడ్డి,
11) ఎల్‌బీ నగర్ అసెంబ్లీ సుధీర్ రెడ్డి,
12) ఆసిఫాబాద్ అసెంబ్లీ ఆత్రం సక్కు
వీరందరినీ కేసీఆర్ ప్రలోభపెట్టి టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారని బక్కా జడ్సన్ స్ష్టం చేశారు. ఫామ్ హౌస్ కేసులో ప్రలోభ పెట్టారని బీజేపీ నాయకులపై అవినీతి నిరోధక చట్టం 1988 కింద కేసు నమోదు చేశారు. కావున తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం-1988 కింద 1988 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకున్నందుకు లంచం ఇవ్వజూపినందుకు కేసు నమోదు చేయాలని ఏసీబీ డైరెక్టర్ ను సవినయంగా కోరుతున్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫామ్ హౌస్ కేసులో ..బీజేపీతో బేరం ఆడినట్లుగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన వారే. రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు ముగ్గురూ.. కాంగ్రెస్ తరపున గెలిచి.. టీఆర్‌ఎస్‌లో చేరారు. వారు అమ్ముుడుపోయారని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తూ ఉంటారు. వారితో రాజీనామా చేయించి ఉపఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉంటారు. అయితే శాసనసభాపక్షం విలీనం అయిందని గతంలో స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. దీంతో వారు అధికారికంగా టీఆర్ఎస్ సభ్యులయ్యారు.