Kalyanamastu Gold : తెలంగాణ ప్రభుత్వం పథకాల అమలు విషయంలో ఇప్పటికే ఎన్నో విమర్శలు ఎదుర్కొటోంది. దానికి తోడు ప్రజలకు ఇస్తామని ప్రకటించిన తులం బంగారం హామీకి ఇప్పుడు తిలోదకాలు ఇచ్చారు. కల్యాణ లక్ష్మి పథకంలో భాగంగా పెళ్లికి తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు. ఈ పథకంపై పెళ్లిళ్లు చేసుకుంటున్న వారు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ఆయితే   దాన్ని ఇవ్వలేమని బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తాము హమీ ఇచ్చినప్పుడు రూ.యాభై వేలు ఉన్న బంగారం ధర ఇప్పుడు లక్ష దాటిందని అందుకే ఆ ఖర్చును ప్రభుత్వం భరించలేదని చెబుతున్నారు.             

Continues below advertisement

తులం బంగారం హామీతో భారీగా మహిళల ఓట్లు పొందిన కాంగ్రెస్         

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మహిళలకు తులా బంగారం ఇస్తామని ప్రచారం చేసింది, కానీ అధికారంలోకి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ "ఇవ్వలేము" అని చెప్పడం విపక్షాలకు ఆయుధంగా మారింది. "ఎన్నికల సమయంలో 'బంగారం' ఇస్తామని చెప్పి, పాలిత తర్వాత 'బడ్జెట్ లేకపోతుంది' అనడం మోసం" అంటూ BRS నేతలు విమర్శిస్తున్నారు.   ప్రభుత్వం ఇప్పుడు 'ప్రాక్టికల్ కాదు' అంటూ తప్పించుకోవడం మహిళలను మోసంమ చేయడం అనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. తెలంగాణలో పెళ్లి సమయంలో మహిళలకు ఆర్థిక సహాయం అవసరమని కల్యాణ లక్ష్మి పథకం రూపొందింది.  పేద కుటుంబాల్లో పెళ్లి ఖర్చులు 5-10 లక్షలకు చేరుకుంటాయి.. ఈ ఖర్చులో బంగారానికి ఎక్కువ వాటా. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా తులం బంగారం ఇస్తే ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. కానీ ప్రభుత్వం తమకు ఆర్థిక భారమని తప్పించుకుంటోంది.           

Continues below advertisement

రేట్లు పెరిగిపోయాయని బంగారం ఇవ్వలేమని ప్రకటించిన పొన్నం           

కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి మోసం చేసిందని ఆరోపిస్తూ భారత రాష్ట్ర సమితి నేతలు ఇప్పటికే విమర్శలు ప్రారంభించారు. "కాంగ్రెస్ ఎన్నికల ముందు 'బంగారం' చెప్పి, ఇప్పుడు 'ఇవ్వలేము'.. మహిళలను మోసం చేస్తున్నారు" అని   కేటీఆర్ మండిపడ్డారు.  మహిళల పథకాలు 'పేపర్ ప్రామిస్‌లు' మాత్రమే" అని విమర్శిస్తున్నారు.  మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన తర్వాత తీవ్రమైన విమర్శలు వస్తున్నా ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో మహిళల్ని విపరీతంగా ఆకర్షించిన అంశాల్లో తులం బంగారం పథకం కూడా ఒకటి. ఆ పథకం ప్రకటన వల్ల మహిళల ఓట్లు పెద్ద ఎత్తున పడి ఉంటాయని అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పథకాన్ని ఇవ్వలేమంటే ప్రజలు ముఖ్యమంగా మహిళలు అసంతృప్తికి గురవుతారు.           

చేతులెత్తేయడం చేతకానితనమే - ప్రజలు సహించరు !               

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న 'కల్యాణ లక్ష్మి పథకం' పెళ్లి సమయంలో పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే ముఖ్యమైన స్కీమ్. SC/ST/BC/EWS/మైనారిటీలకు చెందిన అమ్మాయిల పెళ్లికి రూ. 1,00,116 సహాయం ఇస్తుంది. 2014లో  కేసీఆర్ హయాంలో ప్రారంభమయింది.  పేద కుటుంబాల్లో అమ్మాయిల పెళ్లి ఖర్చులు తగ్గించడం కోసం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు.  2014 నుంచి 10 లక్షలకు అమ్మాయిలకు పెళ్లిళ్లకు సాయం చేశారు. ఈ పథకానికి మరింత వాల్యూ యాడ్ చేసి ఓట్లు సంపాదించాలనుకున్న కాంగ్రెస్..  తులం బంగారం ప్రకటన చేసి ఇరుక్కుపోయింది. ఇప్పుడు పథకం ఇవ్వకపోతే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిలయినట్లే అవుతుంది.