Telangana Congress Lok Sabha incharges :  అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అత్యధిక సీట్లు గెల్చుకునేందుకు పట్టుదలగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా.. కొత్తగా ఇంచార్జుల్ని నియమించారు.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ అత్యధిక పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ నియమించింది. తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డిని అధిష్టానం నియమించింది. ఈ కమిలో రేవంత్ రెడ్డితో పాటు మొత్తం 25 మంది ఉన్నారు. మరో ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. తాజాగా   పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా కో-ఆర్డినేటర్లను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.



తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు ఏఐసీసీ నియమించిన కో-ఆర్డినేటర్లు వీరే 


అదిలాబాద్ (ఎస్టీ) – డి. అనసూయ (సీతక్క)
పెద్దపల్లి (ఎస్సీ) – డి. శ్రీధర్ బాబు
కరీంనగర్ – పొన్నం ప్రభాకర్
నిజామాబాద్ – టి. జీవన్ రెడ్డి
జహీరాబాద్ – పి. సుదర్శన్ రెడ్డి
మెదక్ – దామోదర్ రాజనర్సింహ
మల్కాజిగిరి – తుమ్మల నాగేశ్వరరావు
సికింద్రాబాద్ – మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్ – మల్లు భట్టి విక్రమార్క
చేవెళ్ల – రేవంత్ రెడ్డి
మహబూబ్ నగర్ – రేవంత్ రెడ్డి
నాగర్ కర్నూల్ (ఎస్సీ) – జూపల్లి కృష్ణారావు
నల్గొండ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
భువనగిరి – కోమిరెడ్డి వెంకట్ రెడ్డి
వరంగల్ (ఎస్సీ) – కొండా సురేఖ
మహబూబాబాద్ (ఎస్టీ) – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి


లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్న కాంగ్రెస్ పార్టీ.. క్లస్టర్ల వారీగా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. దేశంలోని రాష్ట్రాలు/యూటీలను 5 క్లస్టర్లుగా విభజించి.. కమిటీలను నియమించింది. శుక్రవారం ఈ మేరకు కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ   కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. తెలంగాణతో పాటు సౌతిండియాలోని కర్నాటక, తమిళనాడు, కేరళ, లక్ష్యద్వీప్, పుదుచ్చేరిలను క్లస్టర్ –1లో చేర్చింది.             


పార్టీలోని సీనియర్‌ నేతలతో పాటు మంత్రులను, నేతలను సమన్వయం చేసుకునేలా త్వరలోనే ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.  త్వరలో లోక్‌సభ నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. ఏఐసీసీ అగ్రనేతలతోపాటు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మంత్రులు, పార్టీలోని ముఖ్యనేతలతో సమావేశమై వ్యూహాలపై చర్చించనున్నారు.               


 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు పార్టీ సీనియర్‌ నేతలతో సమావేశాన్ని కూడా నిర్వహించింది. ఈ ఎన్నికల్లో అభ్యర్థులను ఎవరిని బరిలో దింపాలనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టుగా సమాచారం. అయితే ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ త్యాగం చేసిన వారికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయితే ఎమ్మెల్యే టికెట్‌ కోసం రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాలామంది సీనియర్‌ నేతలు ఆశావహులుగా ఉన్నారు.