Bhuvanagiri: భువనగిరి స్కూల్ హాస్టల్‌లో ఆకస్మిక తనిఖీలు - మెనూ పాటించకపోవడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, సిబ్బంది సస్పెండ్

Telangana News: భువనగిరిలో స్కూల్ హాస్టల్‌ను కలెక్టర్ హనుమంతరావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొత్త మెనూ పాటించడం లేదని సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేర్ టేకర్‌ను సస్పెండ్ చేశారు.

Continues below advertisement

Collector Sudden Checking In Hostel In Bhuvanagiri: భువనగిరి (Bhuvanagiri) పట్టణంలో వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్‌ను జిల్లా కలెక్టర్ హనుమంతరావు తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనంలో సరిగ్గా కొత్త మెనూ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడ్లు సరిగా లేవని, పెరుగుకు బదులు మజ్జిగ పెడుతున్నారని, పిల్లలతో పనులు చేయిస్తున్నారని కేర్ టేకర్ రమేష్‌పై చర్యలు చేపట్టారు. అతన్ని సస్పెండ్ చేసిన కలెక్టర్ స్కూల్ ప్రిన్సిపల్‌కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 'మెనూ ఏంటీ? మీరు పెట్టేదేంటీ.? అది పెరుగా.? నీళ్ల మజ్జిగా.? ప్రభుత్వం 40 శాతం మెస్ ఛార్జీలు ఎందుకు పెంచింది.?. మనం తినడానికా.? నిన్ను ఇప్పుడే సస్పెండ్ చేస్తున్నా.' అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం కచ్చితంగా మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

Continues below advertisement

Also Read: CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు

 

Continues below advertisement