CM Revanth Reddy Key Decisions For Climate Resilience: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది దాటింది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారు. చెరువులను సంరక్షించే దిశగా హైడ్రా (HYDRA) ఏర్పాటు, పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేస్తున్నారు. హరితవిప్లవం దిశగా ఆయన పాలన సాగుతోంది. సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే వాతావరణ సమస్యలపై రేవంత్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్లు, చెరువుల ఆక్రమణను నివారించేలా.. అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు 'హైడ్రా'ను ఏర్పాటు చేశారు. అలాగే, పునరుత్పాదక ఇంధనం, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పునరుద్ధరణతో తెలంగాణకు పచ్చదనంతో పాటు స్థిరమైన భవిష్యత్తు అందించేందుకు ఆయన కృషి చేస్తున్నారు.


ముఖ్యమైన ప్రాజెక్టులివే..


ఒకప్పుడు భాగ్యనగరం.. చెరువులు, సరస్సులకు నెలవై ఉండగా.. కబ్జాల కారణంగా సరస్సులు ఉనికిని కోల్పోయి పూర్తిగా ఆక్రమణలకు గురైంది. ఈ క్రమంలో కబ్జాదారులపై ఉక్కుపాదం మోపేలా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు. 'హైడ్రా' ఏర్పాటు చేసి చెరువులు, సరస్సుల్లో కబ్జాలు నివారించేలా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 75 సరస్సుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. మొత్తం 2 వేల సరస్సుల రూపురేఖలు మార్చే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా జీవ వైవిధ్యాన్ని మెరుగు పరచడం సహా భూగర్భ జలాలు నిండేలా చర్యలు చేపడుతున్నారు. వలస పక్షులను తిరిగి తీసుకురావడంతో 'హైడ్రా' ప్రాజెక్ట్ ఎంతో సహాయపడింది. సరస్సులకు కొత్త శోభ రావడంతో ఫ్లెమింగోలు, రెడ్ బ్రెస్టెడ్ ఫ్లైక్యాచర్ వంటి జాతులకు చెందిన పక్షులు తిరిగిరావడం పర్యావరణ పునరుద్ధరణతో పాటు మానవాళికి ఎంతో ప్రయోజనం చేకూర్చనుందని ప్రకృతి ప్రేమికులు భావిస్తున్నారు.


Also Read: Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు