CM Revanth to play football with football legend Messi:  తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో జరగనున్న ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం ఉప్పల్‌లో సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. డిసెంబర్ 13న ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 'గోట్ కప్' ఫ్రెండ్లీ మ్యాచ్‌లో సీఎం తన జట్టుతో కలిసి మెస్సీ టీమ్‌తో పోటీపడనున్నారు. 

Continues below advertisement

సీఎం రేవంత్ రెడ్డికి పుట్ బాల్ అంటే చాలా ఇష్టం. గతంలో కూడా..ఆయన హెచ్ సీయూ స్టూడెంట్స్ తో కలిసి ఫుట్ బాల్ ఆడిన సందర్భాలు ఉన్నాయి. వివిధ మైదానాల్లో ఆటవిడుపుగా ఫుట్ బాల్ ఆడారు. ఇప్పుడు ఏకంగా మెస్సీతో కలిసి ఆడే అవకాశం రావడంతో మరింత చురుగ్గా ప్రాక్టీస్ చేస్తున్నారు.     

'గోట్ ఇండియా టూర్' భాగంగా ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు.   మెస్సీ టీంతో తలపడే జట్టుకు ముఖ్యమంత్రి రేవంత్ కెప్టెన్సీ వహించే అవకాశం ఉంది.  ప్రభుత్వ స్కూల్స్‌కు చెందిన ఫుట్ బాల్ ప్లేయర్లు రేవంత్ టీంలో ఆడనున్నారు.  ఆర్‌ఆర్ 9 జెర్సీతో సీఎం బరిలోకి దిగనున్నారు. ఎంతో బిజీ ఉన్నప్పటికీ ఈ మ్యాచ్‌ కోసం సీఎం రేవంత్ ఫుట్‌‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు.  ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్న సీఎం రేవంత్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే ఈ ఫోటోలను కాంగ్రెస్ శ్రేణులు, రేవంత్ అభిమానులు షేర్ చేస్తున్నారు.       

 ఫుట్‌బాల్ ఇష్టపడే సీఎం రేవంత్ రెడ్డి, తన వర్క్ షెడ్యూల్‌లో రాత్రి సమయాల్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆదివారం ) రాత్రి ఉప్పల్ స్టేడియంలో స్థానిక ఫుట్‌బాల్ ఆటగాళ్లతో కలిసి ముమ్మరంగా  ప్రాక్టీస్ చేశారు.    

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ 14 సంవత్సరాల తర్వాత ఇండియాను మళ్లీ సందర్శిస్తున్నాడు. GOAT ఇండియా టూర్ 2025 పేరిట డిసెంబర్ 13 నుంచి 15 వరకు నాలుగు నగరాల్లో ఈ టూర్ జరగనుంది. ఫుట్‌బాల్, సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యాన్ మీటింగ్‌లతో కూడిన ఈ ఈవెంట్  బిజీగా సాగనుంది.  మెస్సీ టూర్ డిసెంబర్ 13న కోల్‌కతాలో ప్రారంభమై, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో జరిగి ముగుస్తుంది. ఇది ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, కాన్సర్ట్‌లు, చారిటీ ఈవెంట్‌లు, మీట్-అండ్-గ్రీట్ సెషన్‌లతో కూడిన మల్టీ-సిటీ ఫెస్టివల్ వంటివి ఉంటాయి.  టికెట్లు జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి.   మెస్సీ డిసెంబర్ 12న కోల్‌కతాలో ల్యాండ్ అవుతాడు.  2011 తర్వాత మెస్సీ మొదటి ఇండియా సందర్శన. ఈ టూర్‌కు కారణం 2025 దుర్గా పూజల్లో కోల్‌కతాలో మెస్సీ స్టాచ్యూ ఏర్పాటు. ప్రమోటర్ సతద్రు దత్తా 8 నెలలు ప్రయత్నించి మెస్సీ, అతని తండ్రి జార్జ్‌తో సమావేశమై, ఫిబ్రవరి 2025లో ఫైనల్ ప్లాన్ ఆమోదించారు.