Revanth Reddy Fever : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్వరం బారిన పడ్డారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసంలో ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. గత మూడు రోజుల నుంచి జ్వరం, గొంతు నొప్పితో రేవంత్ బాధపడుతున్నట్లు సమాచారం. ఇంటి వద్దే ఫ్యామిలీ డాక్టర్ రేవంత్‌ను పరీక్షించి, మందులు సూచించినట్లు తెలుస్తోంది.
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ కలిశారు. తాజాగా సీఎం నివాసంలో కేఏపాల్ సీఎంతో భేటీ అయ్యారు. జనవరి 30వ తేదీన హైదరాబాద్‌లో జరిగే గ్లోబల్ పీస్ సమ్మిట్‌కు హాజరు కావాలని రేవంత్ రెడ్డిని పాల్ ఆహ్వానించారు. ఇందుకు కావాల్సిన అనుమతిని కేఏపాల్ సీఎంను కోరారు. దీనిపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారని కేఏపాల్ తెలిపారు. ఈ ప్రపంచ శాంతి సదస్సుకు పలువురు జాతీయ నాయకులు ఆహ్వానించనున్నట్లు కేఏపాల్ పేర్కొన్నారు. ఈ సదస్సుకు పలు దేశాల నుంచి వేల మంది హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.
రేవంత్ రెడ్డి జ్వరంతో ఉన్నప్పటికీ కొంత మందిని కలుస్తున్నరు. గత ఏడాదిగా రేవంత్ రెడ్డి విశ్రాంతి లేకుండా పర్యటనలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల సన్నాహాలు.. ఆ తర్వాత ప్రచారం.. వెంటనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వాన్ని ట్రాక ్లోకి తీసుకు రావడానికి విస్తృతంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలకు కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉండంతో.. ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు.
ఆదివారం.. కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షలు నిర్వహించారు. పథకాల అమలుపై దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో అలసట వల్ల ఆయనకు స్వల్ప అస్వస్థత చోటు చేసుకుందని అంతే కానీ. జ్వరం లాంటిది కూడా ఏమీ లేదని చెబుతున్నారు. క్రిస్మస్ సెలవు సందర్భంగా ఆయన ఇంట్లోనే పలువురికి అపాయింట్‌మెంట్లు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.