CM Revanth Reddy Key Decisions On Industrail Development: తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కు సంబంధించి మంగళవారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవాల్సిన నూతన విధానాలపై పలు సూచనలు చేశారు. గత సమీక్షా సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, పనుల్లో పురోగతికి సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. టెక్స్ టైల్స్‌కు సంబంధించి రాష్ట్రంలోని పవర్ లూమ్, హ్యాండ్ లూమ్ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త పాలసీని రూపొందించాలని సీఎం అధికారులకు సూచించారు.


'ఆరు కొత్త పాలసీలు'


పారిశ్రామిక అభివృద్ధికి (Industraial Development) సంబంధించి కొత్తగా ఆరు పాలసీలను రూపొందించనున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఎంఎస్ఎంఈ పాలసీ, ఎక్స్ పోర్ట్ పాలసీ, న్యూ లైఫ్ సైన్సెస్ పాలసీ, రివైజ్డ్ ఈవీ పాలసీ, మెడికల్ టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీలను రూపొందిస్తుమన్నామని వివరించారు. ఈ క్రమంలో అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ముగిసేలోగా పారిశ్రామిక పాలసీలను పూర్తిస్థాయిలో రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రపంచ దేశాల్లో ది బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పారిశ్రామికాభివృద్ధి మరింత మెరుగుపరుస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సమీక్షలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.


Also Read: KTR : రెండో సారి మోసపోతే మనదే తప్పు - కాంగ్రెస్‌ను నమ్మవద్దని కేటీఆర్ హెచ్చరిక