Revanth Reddy Predicts 182 Assembly Seats Telangana:    తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మరోసారి అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో నిర్వహించిన కాంగ్రెస్  రైతు ఆశీర్వాద సభ  బహిరంగ సభ వేదికగా ఆయన బీఆర్‌ఎ అధినేత కేసీఆర్ కుటుంబానికి తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ రాజకీయ ముఖచిత్రం నుంచి శాశ్వతంగా పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ సైనికులు, కార్యకర్తలు నిద్రపోరని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.  కాచుకో కేసీఆర్.. నీ బలగమంతా ఈ మాట గుర్తుపెట్టుకోండి. భద్రాచలం సీతారామచంద్రస్వామి సాక్షిగా ఒట్టేసి చెబుతున్నా.. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తాం  అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.  2029 జూన్‌లో ఎన్నికలు.. 182 అసెంబ్లీ స్థానాలు! 

Continues below advertisement

సరికొత్త జాతీయ రాజకీయ సమీకరణాలను తెరపైకి తెస్తూ రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా జరగబోయే జమిలి ఎన్నికల ప్రణాళికపై క్లారిటీ ఇచ్చారు. దేశంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ, అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆప్   వంటి ప్రాంతీయ పార్టీలను చీల్చడానికి కేంద్రంలోని బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్రం అనుకున్న బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదించుకునే కుట్రల్లో భాగంగా.. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ  బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.  తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య భారీగా పెరగనుందని, 2029 మే లేదా జూన్ నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి సరికొత్త రీతిలో ఎన్నికలు జరుగుతాయని ఆయన అంచనా వేశారు. పునర్వ్యవస్థీకరణ తర్వాత తెలంగాణలో లోక్‌సభ స్థానాలు 26కు, అసెంబ్లీ స్థానాలు 182కు పెరుగుతాయని సీఎం సరికొత్త లెక్కలను ప్రకటించారు.   పెరిగే స్థానాల్లో 117 సీట్లు కాంగ్రెస్‌వే 

రాబోయే ముందస్తు రాజకీయ ముఖచిత్రంలో పెరిగే 182 అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే 117 స్థానాలను కైవసం చేసుకుని మళ్లీ ప్రభంజనం సృష్టిస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాను చెప్పిన రాజకీయ జోస్యం ఎలా ఫలించిందో ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా నేను ఇలానే జోస్యం చెప్పాను. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 65 సీట్లతో అధికారంలోకి వస్తుందని స్పష్టంగా ప్రకటించాను. మేము అనుకున్నట్లుగానే నాడు 64 సీట్లు సాధించి ఇక్కడ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు అదే నమ్మకంతో ఖమ్మం గడ్డ పైనుంచి జోస్యం చెబుతున్నా.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ 117 సీట్లు గెలవడం ఖాయం  అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.  కేసీఆర్ టార్గెట్‌గా కౌంటర్లు 

Continues below advertisement

జగన్నాథపురం సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు అటు లీడర్లలో, ఇటు సోషల్ మీడియా వేదికలపై పెను దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా భద్రాచలం రాముడిపై ఒట్టేసి కేసీఆర్‌కు సవాల్ విసరడం, 2029 నాటికి తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 182కు పెరుగుతాయని కాన్ఫిడెంట్‌గా చెప్పడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.   రైతు భరోసా నిధులు రూ. 1009 కోట్లు విడుదల సందర్భంగా జరిగిన ఈ రైతు ఆశీర్వాద సభ  కేవలం ప్రభుత్వ కార్యక్రమంగానే కాకుండా, రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలకు వేదికగా మారింది. కేసీఆర్ ఫ్యామిలీని, బీఆర్‌ఎస్ శ్రేణులను పూర్తిగా నిరుత్సాహపరిచేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మక ప్రసంగం చేశారు. నియోజకవర్గాల విభజన బిల్లుపై కేంద్రం అడుగులు, 26 ఎంపీ స్థానాల పెంపు వంటి జాతీయాంశాలను రేవంత్ ప్రస్తావించడంతో.. రాబోయే రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.