CM Revanth Reddy Interesting Tweet on Meet With People: సామాన్య ప్రజలకు తాను నిత్యం అందుబాటులో ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో సీఎం మాదిరి కాకుండా తాను నిత్యం ప్రజల సమస్యలు వింటానని.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ మేరకు శనివారం ఆసక్తికర ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులను ఆయన నేరుగా కలుసుకున్నారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి భారీగా వచ్చిన వారి సమస్యలను నేరుగా వినడంతో పాటుగా.. వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొన్ని సమస్యలను కోడ్ అనంతరం పరిష్కరిస్తానని భరోసా ఇచ్చినట్లు సమాచారం. అటు, జీవో 317 ఇబ్బందులను పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే పరిష్కరిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. వివిధ కుల సంఘాల ప్రతినిధులు, 317 జీవో బాధిత ఉద్యోగులు ఆయన్ను కలవగా.. వారికి ఈ మేరకు హామీ ఇచ్చారు.
ఏం ట్వీట్ చేశారంటే.?
ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. 'నేను… చేరలేని దూరం కాదు… దొరకనంత దుర్గం కాదు… సామాన్యుడు మనిషిని నేను… సకల జన హితుడను నేను.' అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
Also Read: BRS: భువనగిరి, నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు - కేసీఆర్ కీలక ప్రకటన