GATE 2024 Score Card: దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2024 పరీక్ష ఫలితాలను ఐఐఎస్సీ బెంగళూరు మార్చి 16న విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా మార్చి 23న గేట్-2024 స్కోరుకార్డులను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో స్కోర్‌కార్డును అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి స్కోరుకార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సబ్జెక్టులవారీగా కటాఫ్ మార్కుల వివరాలను కూడా ఐఐఎస్సీ బెంగళూరు ప్రకటించింది.
GATE 2024 స్కోర్‌కార్డుల కోసం క్లిక్ చేయండి..
సబ్జెక్టులవారీగా కటాఫ్ మార్కుల కోసం క్లిక్ చేయండి..
GATE 2024 పరీక్షకు సంబంధించిన తుది ఆన్సర్ కీని ఐఐఎస్సీ బెంగళూరు మార్చి 15న విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో దేశంలోని 200 నగరాల్లో గేట్ పరీక్షలను ఐఐఎస్సీ బెంగళూరు నిర్వహించగా.. ప్రాథమిక ఆన్సర్ కీని ఐఐఎస్సీ బెంగళూరు ఫిబ్రవరి 19న విడుదల చేసింది. అభ్యర్థుల రెస్సాన్స్ షీట్లను కూడా విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 22 నుంచి 25 మధ్య అభ్యంతరాలు స్వీకరించింది. మార్చి 15న ఫైనల్ ఆన్సర్ కీని, మార్చి 16న ఫలితాలను ప్రకటించగా.. మార్చి 23న కటాఫ్ మార్కులు, స్కోరుకార్డును విడుదల చేశారు.
గేట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 7 ఐఐటీల(బొంబయి, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ)తో పాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు కూడా గేట్ స్కోరునే ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి. కొన్ని ప్రభుత్వ సంస్థలు గేట్ స్కోరు ద్వారా ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి. గేట్ ద్వారా ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు డాక్టోరల్ పోగ్రామ్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థులు గేట్ పరీక్షలో సాధించిన స్కోరు ఫలితాల వెల్లడి నుంచి 3 సంవత్సరాల పాటు వర్తిస్తుంది.
ALSO READ:
నేషనల్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్- 2024 నోటిఫికేషన్ వెల్లడి, పరీక్ష ఎప్పుడంటే?
భువనేశ్వర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ & రిసెర్చ్ (నైసర్), యూనివర్సిటీ ఆఫ్ ముంబయి ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ (సీఈబీఎస్) సంస్థల్లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'నేషనల్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్) 2024' నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 20న ప్రారంభంకాగా.. మే 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1,400 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.700 చెల్లిస్తే సరిపోతుంది.
ప్రవేశ పరీక్ష దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..