CM Revanth Reddy chit chat:  తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తాను రెండు టర్మ్‌లు సీఎంగా ఉంటానని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకరించాలని కోరుతూ, గుజరాత్ సీఎంగా మోదీ ఉన్నప్పుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎలా సహాయం చేశారో ఇప్పుడూ అలాగే చేయాలని విజ్ఞప్తి చేసినట్లుగా చెప్పారు.  దేవుళ్లపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని అన్నారు.   డీసీసీ అధ్యక్షుల సమావేశంలో పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమేనని చెప్పే ప్రయత్నం చేశానని తెలిపారు.      

Continues below advertisement

దేవుళ్లును ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను  అనవసర వివాదం చేస్తున్నారని రేవంత్ అన్నారు. డీసీసీ అధ్యక్షుల నియామకాలు , చిన్న వయసు వారికి అవకాశం కల్పించడంతో వారికి పార్టీ పరిస్థితుల గురించి చెప్పానన్నారు.  పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉండడం సహజం. ఒకరు వెంకటేశ్వరుడిని పూజిస్తారు, మరొకరు హనుమంతుడిని. దేవతలపై  ఏాభిప్రాయం రాలేదు కదా .. రాజకీయ నాయకులు, డీసీసీ అధ్యక్షులపై ఎలా వస్తుందని ఆయన ప్ఱశ్నించారు. కాంగ్రెస్ పార్టీ హిందూ సమాజం లాంటిదన్నారు.  

Continues below advertisement