CM Revanth Reddy in Telangana Rising Summit:   తెలంగాణను ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ రాష్ట్రంగా నిర్మించాలన్న ఆశయాన్ని సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌లో ప్రసంగిస్తూ వ్యక్తం చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైన ఈ సమ్మిట్‌లో, 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చే లక్ష్యాన్ని ప్రకటించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2047లో, తెలంగాణ దేశ జీడీపీలో 10 శాతం సహకారం అందించాలని, చైనా ఆదర్శాలతో ముందుకు సాగాలని సీఎం ఆకాంక్షించారు.

Continues below advertisement

సమ్మిట్ ప్రారంభ సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ఏర్పాటు వెనుక సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్‌ల  కృషి ఉందన్నారు. 2014లో కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ, యంగెస్ట్ స్టేట్ అయినప్పటికీ ప్రపంచంలో బెస్ట్ రాష్ట్రంగా ఎదగాలన్నదే మా కల అని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, బీఆర్ అంబేడ్కర్‌ల ఆదర్శాలను ఆధారంగా చేసుకుని రాష్ట్ర భవిష్యత్ రోడ్ మ్యాప్‌ను రూపొందించినట్లు వివరించారు. 2034 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్ డాలర్ల స్థాయికి, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చే లక్ష్యాన్ని ప్రకటించారు. భారత జనాభాలో తెలంగాణ రెండు శాతం మాత్రమే ఉన్నప్పటికీ, ప్రస్తుతం దేశ జీడీపీలో 5 శాతం సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. 2047 నాటికి ఈ సహకారాన్ని 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

చైనాలోని వాంగ్ డాంగ్ ప్రావిన్స్‌ను ఆదర్శంగా తీసుకుని, 20 ఏళ్లుగా అత్యధిక పెట్టుబడులు, ఉత్పత్తితో చైనాను లీడ్ చేస్తున్న ఆ మోడల్‌ను అనుసరిస్తామని సీఎం పేర్కొన్నారు. "తెలంగాణ పోటీ చైనా, జపాన్ దేశాలతోనే" అని సవాలు విసిరారు. ఈ సమ్మిట్‌లోనే ‘తెలంగాణ రైజింగ్-2047’ పేరుతో విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ డాక్యుమెంట్‌లో రాష్ట్రాన్ని మూడు ఆర్థిక జోన్లుగా విభజించి, అభివృద్ధిని వికేంద్రీకరించే ప్రణాళిక ఉందని వివరించారు. ఈ ప్రణాళిక మహిళలు, రైతులు, యువత, వివిధ సామాజిక వర్గాల అందరి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రూపొందించామని సీఎం తెలిపారు. 

Continues below advertisement

సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంలో తెలంగాణ భవిష్యత్ కలలను ఆవిష్కరించారు. 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ, 10% జీడీపీ సహకారం, చైనా మోడల్‌తో వికేంద్రీకరణ - ఇవి రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకాలుగా నిలిచాయి. ప్రపంచవ్యాప్తం నుంచి వచ్చిన పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు ఈ సమ్మిట్‌లో తెలంగాణ అవకాశాలపై చర్చించారు. మరిన్ని పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు ఏర్పడేలా ఈ సమ్మిట్ పనిచేస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.