Breaking News Telugu Live Updates: రష్యా, ఉక్రెయిన్ అవసరం లేదు.. ఇక్కడే మెడికల్ సీట్లు ఇస్తున్నాం: కేసీఆర్

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 01 Oct 2022 01:28 PM
24 అంతస్తుల్లో వరంగల్ లో మెడికల్ ఆసుపత్రి, కాలేజీ: సీఎం కేసీఆర్

రాజకీయాల కోసం కేంద్ర మంత్రులు వచ్చి తిట్టిపోతున్నారు, కానీ అవన్నీ ఉట్టి మాటలేనన్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఢిల్లీలో తెలంగాణకు ఎన్నో అవార్డులు వస్తున్నాయి. హైదరాబాద్ ను మించి వరంగల్ లో 2000 పడకల ఆసుపత్రిని తీర్చిదిద్దుతామన్నారు. 24 అంతస్తుల్లో వరంగల్ లో మెడికల్ ఆసుపత్రి, కాలేజీ నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ వాళ్లు సైతం వరంగల్ కు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకునేలా పరిస్థితులు మారతాయన్నారు. సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షాలు తెలుపుతూ జై తెలంగాణ, జై భారత్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు సీఎం కేసీఆర్.

మెడిసిన్ కోసం రష్యా, ఉక్రెయిన్ అవసరం లేదు.. సీఎం కేసీఆర్

ఈ మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయి, అన్ని జిల్లాల్లో కాలేజీలు అందుబాటులోకి వస్తే తెలంగాణ విద్యార్థులు మెడిసిన్ చదివేందుకు రష్యా, ఉక్రెయిన్ లకు వెళ్లే అవసరం లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు చెబుతున్నారని గుర్తుచేశారు కేసీఆర్. బీసీలకు సీట్లు 2000కు పైగా వస్తాయన్నారు. దేశానికే ఆదర్శంగా మనం నిలవాలని, ఏ దేశమైనా చుట్టూ సంభవించే పరిణామాలను గమనించి అప్రమత్తంగా ఉంటేనే పురోగమిస్తాం అన్నారు. దీనికి ఉదాహరణ తెలంగాణ రాష్ట్రమే. ఓనాడు మనం అప్రమత్తంగా లేకపోతే వేరే రాష్ట్రంలో కలిసి, నిర్లక్ష్యానికి గురయ్యాం. అందుకు దశాబ్దాల పాటు పోరాటం చేయాల్సి వచ్చింది. 2001లో తాను మరోసారి ఉద్యమించి, పోరాటం చేస్తే రాష్ట్రం సాధించుకున్నామని గుర్తుచేశారు.

 భారీగా తిరుమలకు చేరుకున్న భక్తులు.. ఇసుక వేస్తే రాలనంత జనం

తిరుపతి : భారీగా తిరుమలకు చేరుకున్న భక్తులు.. ఇసుక వేస్తే రాలనంత జనం....


శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఐదవ రోజు తన ఇష్ట వాహనమైన గరుత్మంతుడి పై అధిరోహించి భక్తులకు కటాక్షాన్నీ ప్రసాదించనున్నారు. గరుడ వాహనంపై కొలువైన శ్రీవారి దర్శనార్థం విశేష సంఖ్యలో భక్తులు తిరుమలకి చేరుకున్నారు. ఎటు చూసిన భక్త జన సంద్రంగా ఏడుకొండలు కనిపిస్తున్నాయి. 2.5లక్షల మంది కూర్చొనే సామర్ధ్యం ఉన్న ఆలయ మాడవీధులలోని గ్యాలరీలు నిండుకుండలా మారాయి. తిరుమలకు ద్విచక్ర వాహనాల అనుమతి రద్దు చేసింది టీటీడీ. భక్తుల సౌకర్యార్థం నిత్యం అన్నపానీయాలు అందిస్తున్నారు.

తాడిపత్రిలో రోడ్డెక్కిన మాజీ ఎమ్మెల్యే జె.సి ప్రభాకర్ రెడ్డి

తాడిపత్రిలో రోడ్డెక్కిన మాజీ ఎమ్మెల్యే జె.సి


అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ పీఎస్ పక్కన ఉన్న ఖాలీ స్థలాన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషను సమస్యపై మున్సిపల్ ఛైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషనును మొదట నేనే అడిగానని, అయితే కోట్లాది రూపాయల విలువ గల స్థలంలో అనుమతి లేకుండా కడతాను అంటే ఉపేక్షించమని ఆయన మండిపడ్డారు. స్టేషన్ కొరకు తాము మున్సిపల్ పరిధిలో మూడు చోట్ల చూపామని అందులో ఎక్కడైనా తమకు అభ్యంతరం లేదని తెలిపారు.

రాష్ట్రం లంకలా మారాలి, పోలవరం ఆగాలని చంద్రబాబు కోరుకుంటున్నారు: అంబటి రాంబాబు

అమరావతి... రాష్ట్రం శ్రీలంక లా అయిపోవాలి.. పోలవరం ఆగిపోవాలి అని చంద్రబాబు కోరుకుంటున్నాడని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.


అమరావతిలో 29 గ్రామాలు తప్ప ఇంకేమీ బాగుపడకూడదు అని చంద్రబాబు ఆలోచన..


పోలవరం విషయంలో చంద్రబాబు అండ్ కో పక్క రాష్ట్రాలను రెచ్చగొడుతున్నారు..


మూడు రాష్ట్రాలు వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేశారు.. కేంద్రం నివృత్తి చేసింది..


భద్రాచలం కి ముప్పే లేదని కేంద్రం తేల్చి చెప్పేసింది..


పోలవరం పై జరగాల్సిన సర్వే లు అన్ని ఎప్పుడో అయిపోయాయి.. అన్ని క్లియరెన్స్ లు ఉన్నాయి..


దేవుడిని అడ్డం పెట్టుకొని మాయ నాటకాలు ఆడుతున్నారు..


ఇది రైతుల పాదయాత్ర కాదు.. వొళ్ళు బలిసిన వారి పాదయాత్ర..


ఈ కొవ్వెక్కిన కోటీశ్వరుల పాదయాత్ర అంతా టీడీపీ బజన..


ఉత్తరాంధ్ర ప్రజల్ని రెచ్చగొడుతున్నారు.. వాళ్ళు తిరిగి ఏమైనా చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు..?


చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు.. ఏమి జరిగినా బాధ్యత ఆయనదే..


హరీష్ రావు గొప్పలు చెప్పుకుంటే చెప్పుకో.. మమల్ని పోల్చల్సిన అవసరం లేదు..


హరీష్ కి కెసిఆర్ కి తగాదాలు ఉంటే అక్కడ తేల్చుకోవాలి..


మమల్ని వేలు పెట్టి చూపించే అర్హత హరీష్ కి కెసిఆర్ కి లేదు..


లోటు బడ్జెట్ లో ఉన్నా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం.. మీరేం చేస్తున్నారు..?


వీటిపై మాతో హరీష్ రావు చర్చకు సిద్ధమా..?


రాజకీయాల్లో వారసులు ఎవరూ ఉండరు.. వారసులకి ప్రజల ముద్ర ఉండాలి..


ప్రజల ముద్రతో వారసులు వేస్తే తప్పేంటి..?


మా పార్టీ బలంగా ఉంది కనుక ఇది మంచి సమయం అని మా వాళ్ళు కొందరు అనుకుంటున్నారేమో తప్పేంటి..?

సీఎం కేసిఆర్ పర్యటనలో అపశృతి,  కాన్వాయ్ నుండి జారి పడ్డ మహిళా కానిస్టేబుల్

సీఎం కేసిఆర్ పర్యటనలో అపశృతి,  కాన్వాయ్ నుండి జారి పడ్డ మహిళా కానిస్టేబుల్
సీఎం కాన్వాయ్ నుండి జారి పడ్డ మహిళా కానిస్టేబుల్
అలాగే ముందుకెళ్ళిన సీఎం కాన్వాయ్
కాన్వాయ్ లోని మరో వాహనంలో ఎక్కిన మహిళ కానిస్టేబుల్.
మహిళా కానిస్టేబుల్ కు స్వల్ప గాయాలు

Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో నేటి రాత్రి కీలకఘట్టమైన గరుడవాహన సేవ

తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో నేటి రాత్రి కీలకఘట్టమైన గరుడవాహన సేవ


గరుడసేవను తిలకించేందుకు  తరలివస్తున్న భక్తులు


మాడవీధుల్లోని గ్యాలరీల్లోకి చేరుకుంటున్న భక్తులు


రాత్రి 7 గంటల నుండి అర్థరాత్రి 1 గంట వరకు గరుడవాహనసేవ ఊరేగింపు


2 లక్షల 70 వేల మందికి వాహనసేవ దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు


మాడవీధుల మూలల్లో భక్తుల హారతులు రద్దు 


మూడు హారతి పాయింట్ల వద్ద క్యూలైన్ ద్వారా 30 వేల మంది భక్తులకు దగ్గరగా వాహనసేవ దర్శనం


ఆలయం ముందున్న గ్యాలరీల్లోకి సెకండ్ ఫిలింగ్ ద్వారా 30 వేల మంది భక్తులకు వాహనసేవ తిలకించే అవకాశం 


ఎలాంటి తోపులాట్లు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు పటిష్ట భద్రతా


5 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత

ఈరోజు నుండి హైదరాబాదులో అందుబాటులోకి రానున్న 5G సేవలు

ఈరోజు నుండి హైదరాబాదులో అందుబాటులోకి రానున్న 5G సేవలు


తొలి విడతలో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన తొమ్మిది నగరాల్లో 5G సేవలు అందుబాటులోకి రానున్నాయి. 


ఈ జాబితాలో అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, గాంధీనగర్, గుర్‌గావ్, హైదరాబాద్,జామ్‌నగర్, లక్నో, పుణే నగరాలు ఉన్నాయి

కమ్యూనిటీ పోలీస్ కార్యక్రమం చేపట్టిన పోలీసులు..

కమ్యూనిటీ పోలీస్ కార్యక్రమం చేపట్టిన పోలీసులు..


ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో వైరా సబ్ డివిజన్ ఏసీపీ ఎంఎ.రెహ్మాన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీస్ కార్యక్రమం చేపట్టిన  పోలీసులు


కాలనీలో తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు


తనిఖీల్లో పాల్గొన్న సబ్ డివిజన్ సీఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది.

Background

Rains in Telangana AP: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి కోస్తా, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు మరొక ద్రోణి విస్తరించిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రభావంతో ఈ సీజన్ చివరిసారి పలు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో శుక్రవారం పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. అక్టోబర్ 2 వరకు ఏపీ, తెలంగాణ, యానాంలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలో మోస్తరు వర్ష సూచనతో ఎల్లో జారీ చేసింది ఐఎండీ.   
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather)
రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అక్టోబర్ 2 వరకు వర్ష సూచన ఉందని, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. శుక్రవారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నేడు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.  
మరికొన్ని గంటల్లో నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు సైతం హైదరాబాద్ ను మేఘాలు కమ్మేశాయి. నగరంలో నేడు సైతం కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన ఉంది. వర్షం పడని ప్రాంతాల్లో మధ్యాహ్నానికి ఉక్కపోత అధికం అవుతుంది. గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచననున్నాయి.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఏపీలో మరో 2 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి. అమరావతి వాతావరణ కేంద్రం సూచన ప్రకారం.. ఈ ప్రాంతాల్లో అక్టోబర్ 2 వరకు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలుపుతూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, కాకినాడ, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లా, యానాంలోనూ మోస్తరు వర్షం కురవనుంది. ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు ఉన్నాయి. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. 
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
ఈ ప్రాంతాల్లో మరో 48 గంటలు మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. అక్టోబర్ 2 వరకు ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వెదర్ మ్యాన్, అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేశాయి. వర్ష సూచనతో ఈ ప్రాంతాలకు ఎల్లో వార్నింగ్ జారీ అయింది. పిడుగులు పడే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.


ముఖ్యంగా రాయలసీమలోనూ భారీ వర్షాలున్నాయి. కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం, తిరుపతి జిల్లాలతో పాటు అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలున్నాయి. ఒకట్రెండు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్ష సూచన ఉంది. నీళ్లు నిలిచి ఉంటే చోట జాగ్రత్తగా ఉండాలని, నీటి ప్రవాహాన్ని దాటి వెళ్లే ప్రయత్నాలు చేయకూడదని ప్రజలను అధికారులు హెచ్చరించారు.


హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.