CM KCR TS Tour: తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటించేందుకు సీఎం కేసీఆర్ సన్నద్ధం అయ్యారు. ఇందుకోసం ప్రణాళిక కూడా సిద్ధం అయిపోయింది. ఈనెల 12వ తేదీన ప్రారంభం కాబోతున్న ఈ పర్యటనలోనే... రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభను కూడా నిర్వహించబోతున్నారు. ఈనెల 18వ తేదీ ఖమ్మంలో బారత రాష్ట్ర సమితి ఆవిర్భావ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఇందుకు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లను ఆహ్వానించారు. కేజ్రీవాల్, భగవంత్ మాన్, అఖిలేష్ లు అంగీకారం తెలిపినట్లు సమాచారం. కానీ కేరళ ముఖ్యమంత్రి మాత్రం తన నిర్ణయాన్ని సోమవారం వెల్లడించనున్నారు. 






ఖమ్మం, మహబూబాబాద్, కొత్తగూడెం కత్త సమీకృత కలెక్టరేట్లు ప్రారంభానికి ముస్తాబయ్యాయి. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అధునాతన వసతులు, ఆధునిక హంగులతో తయారైన కలెక్టరేట్లను ఈనెల 12వ తేదీన సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ముందుగా మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ ను ప్రారంభించిన తర్వాత.. అఖ్కడి నుంచి హెలికాప్టర్ లో కొత్తగూడెం చేరుకుంటారు. అనంతరం కొత్త కలెక్టరేట్ సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. కొత్త ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అనుదీప్ ను కూర్చోబెట్టి జిల్లా పాలనకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. అదేరోజు బీఆర్ఎస్ జిల్లా పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వారత వైద్య కళాశాల, ఫార్మసీ కళాశాలను సందర్శించనున్నారు. ఈనెల 18వ తేదీన ఖమ్మం జిల్లా నూతన కలెక్టరేట్ ను సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లలో తలమునకలైంది. 


జీ ప్లస్ టూ పద్దతిలో 46 ప్రభుత్వ శాఖలు పని చేసేందుకు వీలుగా..


కొత్తగూడెం జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కొత్తగూడెం-పాల్వంచ జాతీయ రహదారి పక్కనే కొలువుదీరిని కలెక్టరేట్ ఆధునిక హంగులతో కొలువుదీరింది. మొత్తం 25 ఎకరాల విస్తీర్ణంలో 45 కోట్ల రూపాయలతో నిర్మించారు. 2018లో ప్రారంభమైన ఈ నిర్మాణం జీ ప్లస్ టూ పద్ధతిలో 46 ప్రభుత్వ శాఖలు పనిచేసేందుకు అనువుగా రూపొందించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోనే ప్రత్యేక హెలిప్యాడ్ నిర్మించారు. మహబూబాబాద్ లో రూ.64 కోట్లతో చేపట్టిన కలెక్టరేట్ ను ఈనెల 21వ తేదీన సీఎం ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లకు కలెక్టర్ సహా అధికారులు పరిశీలించారు. రఘునాథపాలెం మండలం వి. వెంకటాయపాలెంలో ఖమ్మం - వైరా ప్రధాన రహదారి పక్కనే నిర్మించిన ఖమ్మం జిల్లా నూతన కలెక్టరేట్ సముదాయం మొత్తం 20 ఎకరాల్లో 59 కోట్లతో నిర్మించారు.


ముఖ్యమంత్రి 18వ తేదీన కలెక్టరేట్ భవనం ప్రారంభిస్తే ఆరోజు నుంచే జిల్లా ప్రజలకు ప్రభుత్వ పాలన అందించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాను సీఎం కీలకంగా తీసుకోవడం వల్లే ఇక్కడే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఇటీవలే భారాస అధ్యక్షుడిని ప్రకటించారు. అలాగే ఛత్తీస్ గఢ్ లోనూ పార్టీ శాఖనూ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. పైగా ఖమ్మం జిల్లా వామపక్షాలకు బలం ఉంది.