Breaking News Telugu Live Updates: ఢిల్లీ బ్రోకర్ గాళ్లు చంచల్ గూడ జైల్లో ఉన్నారు - కేసీఆర్

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ బ్రేకింగ్ న్యూస్ లైవ్ అప్‌డేట్స్ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 30 Oct 2022 04:44 PM

Background

దక్షిణ కొరియాలో పెను విషాదం చోటుచేసుకుంది. రాజధాని సియోల్‌ నగరంలో నిర్వహించిన హాలోవీన్ వేడుకల్లో తొక్కిసలాట జరగడంతో 149 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వారిలో 20 నుంచి 30 మంది పరిస్థితి...More

KCR Speech: వడ్లు కొనరు కానీ ఎమ్మెల్యేలను కొనేందుకు వస్తరా? - కేసీఆర్

’’మా పంట కొనాలని వడ్లు కొనాలని అడిగితే స్పందించరు కానీ, రూ.వందల కోట్లు సంచులు పట్టుకొని ఎమ్మెల్యేలను కొనాలని వస్తరా? ఈ బీజేపీకి బుద్ధి చెప్పాలా? వద్దా? మీరంతా ఆలోచించాలి. వీటన్నింటికీ మీరు జవాబు చెప్పకపోతే వాళ్లు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తరు. మేం చేసేది ఏమీ ఉండదు. గ్యాస్ రేటు పెరిగింది.. పెట్రోల్ రేట్లు పెరిగాయి.. జీఎస్టీ ఎస్తున్నారని మనం కొట్లాడాలి. కత్తి ఒకరి చేతిలో పెట్టి యుద్ధాన్ని ఇంకొకడ్ని చేయమంటే చేస్తడా? ఎవరి చేతిలో కత్తి పెడతవో.. వాడు మన మెడ కోసేస్తడు. కాబట్టి, కత్తి ఒకడి చేతిలో పెట్టి యుద్ధాన్ని మరొకరిని చేయమంటే సమంజసం కాదు. ప్రజల ఆస్తులు కాపాడే పార్టీలను మీరు గౌరవిస్తే అందరం మంచిగుంటదని గమనించాలి.’’ అని కేసీఆర్ అన్నారు.