హుజూరాబాద్ ఎన్నికల్లో లబ్ది కోసమే దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెడుతున్నారని విపక్షాలు చేస్తున్న విమర్శలను కేసీఆర్ స్వాగతించారు. నిజంగానే తాను ఎన్నికల్లో లబ్ది పొందడానికే ఆ పథకాన్ని పెడుతున్నానని తేల్చేశారు. వందకు వంద శాతం నిజం.. పెట్టిందే ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికేని తేల్చేశారు. కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి పార్టీలో చేరిన సందర్భంగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. గెలవాలంటే పెట్టుకోవాలి కాబట్టి పెట్టామని.. గెలవని వారే హామీలు ఇస్తూంటే.. గెలిచే పార్టీగా తామెందుకు ఇవ్వమని స్పష్టంచేశారు.  కేసీఆర్‌తో రాజకీయం ఇంతే ఉంటుంది. ఆయనపై.. ఎన్ని రకాల రాజకీయ విమర్శలు చేసినా.. చాలా వాటిని ఆయన బరాబర్ అంగీకరిస్తారు. రాజకీయలబ్ది కోసమే చేస్తున్నామని ప్రకటిస్తారు. ఇప్పుడూ అంతే. 


దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టాలని కేసీఆర్ ఇటీవల నిర్ణయించారు. అన్ని పార్టీల్లోని దళిత ప్రముఖుల్ని పిలిచి.. సమావేశం పెట్టారు. వారెన్ని సూచనలు చేసినా.. ముందుగానే నిర్ణయించుకున్నట్లుగా... దళిత బంధు పథకాన్ని వారి సమక్షంలోనే ప్రకటించారు. ప్రతి నియోజకవర్గానికి వంద మందికి...  అన్ని నియోజకవర్గాల్లో  11900 మందికి ఇస్తామని ప్రకటించారు. అయితే..  ఇప్పుడు అనూహ్యంగా నిర్ణయం మార్చుకున్నారు. ముందుగా.. హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులందరికీ.. పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి.. రూ. పది లక్షలు ఇవ్వాలని డిసైడయ్యారు. అంటే..  ఈ పథకం కోసం ఈ ఏడాది కేటాయిస్తున్న.. రూ. పన్నెండు వందల కోట్లు మొత్తం.. హూజూరాబాద్‌లోని దళిత కుటుంబాలకే పంపిణీ చేస్తారు. అక్కడ ఉన్న దాదాపుగా పదివేల దళిత కుటుంబాల్లో.. ఓ ఇరవై శాతం ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నాయని అనుకున్నా.. మిగతా ఎనభై శాతం మందికి పథకం వర్తింప చేయాల్సి ఉంటుంది. 


ప్రభుత్వం ప్రజా ధనం పెట్టి దళితుల ఓట్లను కొనుగోలు చేస్తోందని.. విపక్షాలు విమర్శలు ప్రారంభించాయి. ఎన్నికల్లో లబ్ది పొందడానికే.. ఇలాంటి పథకం తీసుకు వచ్చారని విమర్శిస్తున్నారు. అయితే ఇవి విమర్శలు కాదని.. నిజాలేనని కేసీఆర్ తేల్చేశారు. కేసీఆర్ వైపు నుంచి ఇలాంటి రియాక్షన్ వస్తుదని ఆశించని విపక్షాలు.,. ఇక ఆ దిశగా ఆరోపణలు చేయడం మానుకోక తప్పదు.  రాజకీయ నేతలు.. ఏం చేసినా తాము ప్రజల కోసమే చేస్తున్నామని రాజకీయ లబ్ది కోసం కాదని.. చెప్పుకునేందుకు తాపత్రయ పడుతూంటాయి.కానీ వారి లక్ష్యం రాజకీయ లబ్దే అని అందరికీ తెలుసు. కానీ వారు ఒప్పుకోరు. కానీ కేసీఆర్ అలాంటిలాంటి రాజకీయ నేత కాదు కాబట్టి.. బరాబర్ ఒప్పుకున్నారు. ఇప్పుడు విపక్షాలకు విమర్శించడానికి ఓ ఆయుద్ధం తగ్గిపోయినట్లే.


also read: huzurabad bypoll: కారెక్కిన కౌశిక్ రెడ్డి.. మరి టికెట్ ఎవరికో..?