యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్స్ 2022 పరీక్షా ఫలితాలు నేడు (మే 23) విడుదల అయ్యాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ వంటి అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం ఏటా యూపీఎస్సీ సివిల్స్ పరీక్షను నిర్వహించే సంగతి తెలిసిందే. 2022లో నిర్వహించిన పరీక్షలో మొత్తం 933 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఎంపిక అయ్యారు. ఈ సివిల్స్‌లో ఇషితా కిషోర్‌కు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. గరిమ లోహియా, ఉమా హారతి ఎన్., స్మృతి మిశ్రా తర్వాతి నాలుగు ర్యాంకుల్లో సత్తా చాటారు. వీరిలో మూడో ర్యాంకు పొందిన ఉమాహారతి తెలంగాణకు చెందిన వారు.
ఉత్తమ ర్యాంకులు సాధించిన తెలుగు తేజాలు వీళ్లే
తిరుపతి చెందిన పవన్ దత్తాకు 22వ ర్యాంక్ వచ్చింది. శాఖమూరి శ్రీ సాయి అర్షిత్‌కు 40 వ ర్యాంక్, హెచ్‌ఎస్ భావనకు 55వ ర్యాంక్, అవుల సాయికృష్ణకు 94వ ర్యాంక్, వసంత్ కుమార్‌కు 157 వ ర్యాంక్, కమతం మహేష్ కుమార్‌కు 200వ ర్యాంక్, అనుగు శివమారుతీరెడ్డి 132, రాళ్లపల్లి వసంత్ కుమార్ 157, రావుల జయసింహా రెడ్డికి 217, బొల్లం ఉమామహేశ్వర్ రెడ్డి 270, చల్లా కల్యాణి 285, పాల్వాయి విష్ణువర్దన్ రెడ్డి 292, గ్రంథె సాయికృష్ణ 293, వీరగంధం లక్ష్మి సుజిత 311, ఎన్.చేతనా రెడ్డి 346, శృతి యారగట్టి ఎస్ 362, యప్పలపల్లి సుష్మిత 384, సీహెచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి 426, బొల్లిపల్లి వినూత్న తదితర తెలుగు అభ్యర్థులకు 462 ర్యాంకులు వచ్చాయి.
పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్ సర్వీసులకు 180 మంది, ఐఎఫ్‌ఎస్‌కు 38, ఐపీఎస్‌కు 200 మంది చొప్పున ఎంపికయ్యారు. ఇక సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ - ఎ కేటగిరీలో 473 మంది, గ్రూప్ - బి సర్వీసెస్‌లో 131 మంది ఎంపిక అయినట్లు యూపీఎస్సీ ప్రకటించింది.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ మే 23న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు ఫలితాలను చూసుకోవచ్చు. దేశవ్యాప్తంగా మొత్తం 933 మంది అభ్యర్థులు యూపీఎస్సీ ఎంపికచేసింది. కేటగిరీలవారీగా జనరల్-345, ఈడబ్ల్యూఎస్-99, ఓబీసీ-263, ఎస్సీ-154, ఎస్టీ-72 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఇక సర్వీసులవారీగా చూస్తే.. ఐఏఎస్‌కు 180 మంది, ఐఎఫ్‌ఎస్-38 మంది, ఐపీఎస్-200 మంది, సెంట్రల్ సర్వీసెస్-ఎ-473 మంది, గ్రూప్-బి సర్వీసులకు 131 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాలు ఇలా చూసుకోండి..
1. ఫలితాల కోసం అభ్యర్థులు మొదట వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- upsc.gov.in
2. అక్కడ హోంపేజీలో కనిపించే 'యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలకు సంబంధించిన లింకు పై క్లిక్ చేయాలి.
3. పీడీఎఫ్ ఫార్మాట్‌లో సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా స్కీన్ మీద కనిపిస్తుంది.
4. పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని, జాబితాలో అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు.