Chief Minister Revanth close associate  becomes Kondareddy palle sarpanch: సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ ఎన్నిక  ఏకగ్రీవం జరిగింది.  ఎస్సీ  రిజర్వ్ అయిన సర్పంచ్ పదవికి 15 మంది పోటీ పడినప్పటికీ, గ్రామస్థుల అభిప్రాయంతో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి చిన్ననాటి మిత్రుడు, క్లాస్‌మేట్‌ మల్లెపాకుల వెంకటయ్య  ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 

Continues below advertisement

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ నవంబర్ 28న ప్రకటించిన తర్వాత, రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో ఉత్సాహం మొదలైంది. మొదటి విడతలో 4,236 సర్పంచ్, 37,440 వార్డు సభ్యులకు ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో జరగనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ డిసెంబర్ 3. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి పంచాయతీలో సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ అయింది.  పదవికి ఆసక్తి చూపిన 15 మంది నామినేషన్లు సమర్పించారు. అయితే, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, పార్టీ నేతల సమావేశంలో చర్చలు జరిగి, అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి చిన్నప్పటి మిత్రుడు, ఒకే క్లాస్‌లో చదువుకుని గ్రామంలోనే ఉంటున్న మల్లెపాకుల వెంకటయ్యను సర్పంచ్‌గా ఎన్నుకోవాలని తీర్మానం చేశారు. ఈ ఎంపికకు పోటీ పడే అభ్యర్థులు కూడా తమ నామినేషన్లు ఉపసంహరించుకుని, ఏకగ్రీవకు మద్దతు ప్రకటించారు.

కొండారెడ్డిపల్లి గ్రామంలో రేవంత్ రెడ్డి బాల్యం, చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఏకగ్రీవతో పాటు గ్రామంలోని ఇతర మిత్రులు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వివిధ పదవుల్లో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు.  గ్రామ పెద్దలు, మహిళలు, యువత  వెంకటయ్యకు అభినందనలు తెలిపారు.  రేవంత్ రెడ్డి  చిన్నప్పటి నుంచి మా మిత్రుడని.. అందరి మద్దతుతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని వెంకటయ్య చెబుతున్నారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు 2019 తర్వాత మళ్లీ జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని త్వరగా పూర్తి చేయాలని ప్రణాళిక వేసింది. 

Continues below advertisement

సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే కొండారెడ్డిపల్లిని పూర్తిగా సోలార్ పవర్డ్ విలేజ్‌గా మార్చారు. సౌతర్న్ తెలంగాణ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన ఈ పని సెప్టెంబర్ 2024లో ప్రారంభమై, సెప్టెంబర్ 2025లో పూర్తయింది. గ్రామంలో 1,451 విద్యుత్ కన్స్యూమర్లు కు ఇంటి ఇంటికీ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు గ్రామం స్వయం సమృద్ధంగా మారి, అధిక విద్యుత్ ఉత్పత్తి ద్వారా రాష్ట్ర గ్రిడ్‌కు క్లీన్ ఎనర్జీ సరఫరా చేస్తోంది. 20 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నరాు.  పంచాయతీ భవనం, లైబ్రరీ, వెటర్నరీ హాస్పిటల్ నిర్మిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గ్రామంలో రైతుల సంక్షేమానికి ప్రత్యేక దృష్టి పెట్టారు. రైతు రుణాల మాఫీ, పెన్షన్లు, వ్యవసాయ సహాయకాలు వెంటనే అమలు చేయడంతో గ్రామీణ ఆర్థికత మెరుగుపడింది. ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో కూడా పెట్టుబడులు పెంచారు – లైబ్రరీతో పాటు స్కూళ్లలో డిజిటల్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు. హెల్త్‌కేర్‌కు సంబంధించి, వెటర్నరీ హాస్పిటల్‌తో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బలోపేతం చేశారు.