Rajagopal Vs Kavitha :  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దాఖలు చేసిన తాజా చార్జిషీటులో కవిత పేరు 28 సార్లు ఉందని.. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన విమర్శలు హాట్ టాపిక్ అవుతున్నాయి.  మద్యం దందాలో కవిత పేరు ఉందంటూ బీజేపీ లీడర్ రాజగోపాల్ చేసిన కామెంట్స్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. తొందరపడి మాట జారొద్దని సూచించారు. ఎన్నిసార్లు చెప్పినా అబద్దం నిజం అయిపోదన్నారు.  తాజాగా కోర్టుకు ఈడీ సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో కవిత పేరు ప్రస్తావించారు. దీంతో ప్రతిపక్షాలు విమర్శలకు పదను పెట్టాయి. ఇందులో భాగంగానే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కొన్ని పత్రికల వార్తలను ట్వీట్ చేస్తూ కవిత పేరు ప్రస్తావించకుండానే లిక్కర్ క్వీన్ పేరు 28 సార్లు ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించారని విమర్శించారు. 





రాజ్‌గోపాల్‌రెడ్డి ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చిన కవిత... తొందరపడొద్దని మాట జారొద్దని సూచించారు. 28 సార్లు కాదు 28వేల సార్లు తన పేరు చెప్పినా అబద్దం నిజమైపోదని కామెంట్ చేశారు. మాణిక్యం ఠాకూర్‌  చేసిన ట్వీట్‌కి కూడా కవిత రియాక్ట్ అయ్యారు. తనపై మోపిన అభియోగాలన్నీ బోగస్‌ అని కొట్టిపారేశారు. నా చిత్తశుద్ధిని కాలమే రుజువు చేస్తుందని అభిప్రాయపడ్డారు.  ఇదంతా బీజేపీ రాజకీయ ఆటలో భాగమని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ చీఫ్‌, సీఎం కేసీఆర్‌ను ఆపడానికే ఇదంతా చేస్తున్నారన్నారు. రైతు వ్యతిరేకంగా, కార్పొరేట్‌కు బీజేపీ చేపడుతున్న తీసుకుంటున్న  విధానాలు ప్రజల ముందు ఉంచుతున్నారనే కక్షతోనే ఇదంతా సాగుతున్నారు. 





దీనికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా వెంటనే కౌంటర్ ఇచ్చారు. చెల్లెమ్మా అని సంబోధిస్తూ నిజం నిప్పులాంటిదని.. మునుగోడు ఉపఎన్నికల సమయంలో తన వ్యక్తిత్వంపై నిందలేశారని జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. 





 


సోషల్ మీడియాలో తనపై ఆరోపణలు చేస్తున్న  ప్రముఖులకు..   కవిత కౌంటర్ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్‌కూ కవిత కౌంటర్ ఇచ్చారు.