Lasya News: అల్పాహారం కోసం ఇంటిని బయటకు వచ్చి అనంత లోకాలకు వెళ్లిపోయింది కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత(Lasya Nandhitha). తీవ్రమైన ఆకలిగా ఉండటంతో  టిఫిన్ తినడం కోసం బయటకు వచ్చి అనుకోకుండా జరిగిన కారు ప్రమాదంలో ఎమ్మెల్యే మృతిచెందారు.


టిఫిన్ కోసం వచ్చి తీరని లోకాలకు..
అతి చిన్న వయసులోనే  ఎమ్మెల్యేగా ఎన్నికైన  కంటోన్మెంట్ (Contonment)ఎమ్మెల్యే లాస్య నందిత ఆ పదవిని సంపూర్ణంగా అనుభవించకుండగానే  అనుకోని ప్రమాదంలో కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్  ఓఆర్ఆర్(ORR) లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె అసువులుబాశారు. ప్రమాదానికి  కారణాలను పోలీసులు వెల్లడించారు. గురువారమే సదాశివపేట(Sadhasivapet)లో ఓ దర్గా సందర్శించడానికి వెళ్లిన ఆమె తెల్లవారుజామున  ఇంటికి తిరిగి వచ్చారు. బాగా ఆకలిగా ఉండటంతో అల్పాహారం కోసమని ఇంటి నుంచి బయటకు వచ్చారు.  శామీర్‌పేట(Samirpet) వద్ద  ఔటర్‌ రింగ్‌ రోడ్డు పైకి వచ్చిన ఆమె కారు....వేగంగా దూసుకెళ్లింది. మరికొద్దిసేపట్లో ఆమె కారు ఔటర్ రింగ్ రోడ్డు దిగాల్సి ఉండగా...అదుపు తప్పి రెయిలింగ్ ను ఢీకొట్టింది.


ప్రమాదం జరిగిన తీరును చూస్తే ముందు వెళ్తున్న  టిప్పర్ ను ఢీకొట్టి  కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల తీవ్రంగా గాయపడి మృతిచెందారు. కారు డ్రైవర్ కు రెండు కాళ్లు విరిగిపోయి తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించే లోపు ఆమె చనిపోయినట్లు పోలీసుుల తెలిపారు. తలకు బలమైన గాయం, ఇంటర్నల్‌ బ్లీడింగ్‌ వల్లే లాస్య నందిత చనిపోయినట్టు పోస్టుమార్టం చేసిన వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం మొత్తాన్ని వీడియో తీసినట్లు పోలీసులు తెలిపారు. తుది నివేదిక వస్తే గానీ ఆమె చనిపోవడానికి  అసలు కారణం ఏంటో చెప్పగలమని తెలిపారు. 


అతివేగమే కొంప ముంచింది
అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యంతోపాటు  ఎమ్మెల్యే అజాగ్రత్తే ప్రాణాలు పోవడానికి కారణమని తెలుస్తోంది. తెల్లవారు జామున అప్పుడే ఓఆర్ఆర్ పైకి ఎక్కిన కారు అంతలోనే వందకిలోమీటర్ల వేగం అందుకోవడం చూస్తే డ్రైవర్ నిర్లక్ష్యంగా కారు నడిపినట్లు తెలుస్తోంది. మరికొద్దిదూరంలో  తాము దిగాల్సిన ఎగ్జిట్ పాయింట్ వస్తుందని తెలిసినా...డ్రైవర్ వేగాన్ని  నియంత్రించలేదు. ఓఆర్ఆర్ పై వేగంగా వాహనాలు దూసుకొస్తాయని తెలిసినా...లాస్య నందిత సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారు. పదిరోజుల క్రితమే ఆమె ప్రాణాపాయం నుంచి గట్టెక్కారు. అయినా అదే నిర్లక్ష్యం కనబరిచారు. నల్గొండ సభకు వెళ్లి తిరిగొస్తున్నప్పుడు  ప్రమాదం జరిగి ఉండకపోతే..ఈరోజు ఆమె ప్రాణాలు నిలిచేవని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మహేంద్ర హైఎండ్ కారు వాడుతుండగా...సేప్టీ ఫరంగా ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న ఈ కారులో ప్రమాదం జరిగినా  ప్రాణాలు కోల్పోయేది కాదన్నారు. ఆ రోజు ఆ కారు ప్రమాదానికి గురవ్వడంతో  దాన్ని రిపేర్ కు ఇవ్వడం వల్లే ఈ చిన్న కారు వాడుతోందని తెలిపారు. దీనివల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని బావురమన్నారు. ఏడాది వయసులోనే కుటుంబంలో ఇద్దరిని కోల్పోవడంతో కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరివల్ల కావడం లేదు. గతేడాది ఫిబ్రవరిలోనే నందిత తండ్రి సాయన్న కన్నుమూశారు. ఆ బాధ నుంచి తేరుకునే లోపే ఇప్పుడు కుమార్తె అశువులుబాశారు.