BRS Support MIM : హైద్రాబాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు మద్దతివ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది మార్చి 13వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. హైద్రాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంతో పాటు హైద్రాబాద్-రంగారెడ్డి- మహబూబ్ నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. హైద్రాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుండి ఎంఐఎంకు చెందిన సయ్యద్ హసన్ జాఫ్రీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జాఫ్రీ పదవీకాలం ఈ ఏడాది మే 1వ తేదీన రిటైర్ కానున్నారు. గతంలో కూడా జాఫ్రీకి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది.
అధికారికంగా మిత్రపక్షాలు కాకపోయినా సహకరించుకుంటున్న మజ్లిస్, బీఆర్ఎస్
ఎంఐఎం, బీఆర్ఎస్ అధికారిక మిత్రపక్షాలు కాకపోయినా రాజకీయంగా పరస్పరం సహకరించుకుంటున్నాయి. గతంలోలా మద్దతు ఇవ్వాలని ఇటీవల మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ ను కలిసి కోరారు. కేసీఆర్ అంగీకరించారు. హైదరాబాద్ నగర మేయర్ స్థానానికి.,. బీఆర్ఎస్ తో సమానంగా సీట్లు కార్పొరేటర్ సీట్లు ఉన్నప్పటికీ మేయర్ స్తానానికి మజ్లిస్ పోటీ చే్యలేదు. అదే సమయంలో రాజకీయంగా రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన మేరకు మద్దతు నిర్ణయం తీసుకున్నారు.
స్థానిక సంస్థల కోటాలో బీజేపీ, మజ్లిస్ కన్నా బీఆర్ఎస్‌కే ఎక్కువ ఓట్లు
హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో మొత్తం 127 ఓట్లు ఉన్నాయి. ఇందులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సభ్యులు ఎనిమది మందికి కూడా ఓట్లు ఉన్నాయి. కానీ ఓ బోర్డుకు ప్రస్తుతం సభ్యులు లేరు. బీజేపీ కార్పొరేటర్ దేవర కరుణాకర్ చనిపోయారు. దీంతో మొత్తం ఓటర్ల సంఖ్య 118గా తేలింది. ఇందులో 83 మంది గ్రేటర్ కార్పొరేటర్లు మిగతా 35 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు. వీరంతా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే ఇటీవల కొంత మంది కార్పొరేటర్లు పార్టీలు మారారు. మొత్తంగా బీజేపీకి 33 ఓట్ల బలం ఉంటే.. బీఆర్ఎస్, మజ్లిస్‌కు కలిపి 83 ఓట్ల బలం ఉన్నట్లుగాఅంచనా వేస్తున్నారు. అయితే ఓట్ల రంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ ఉంటాయి. అయినప్పటికీ కేసీఆర్ మజ్లిస్ పార్టీకే అనుకులంగా నిరణయం తీసుకున్నారు.
అసెంబ్లీలో కేటీఆర్, అక్బరుద్దీన్ వాగ్వాదం - ప్రభావం లేనట్లే !
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్, అక్బరుద్దీన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.ఈ క్రమంలో తాము వచ్చే ఎన్నికల్లో యాభై సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించారు. దీంతో రెండు పార్టీల మధ్య విబేధాలు ఏర్పడ్డాయని అనుకున్నారు. కానీ నిర్ణయాలు తీసుకునేది కేటీఆర్, అక్బరుద్దీన్ కాదు కాబట్టి .. పై స్థాయిలో అధినేతలు సఖ్యంగానే ఉన్నారు. కలిసే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ సఖ్యత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని బీఆర్ఎస్ వర్గాలు నమ్మకంతో ఉన్నాయి.