MLC Kavitha Arrest Live Updates: కవిత అరెస్టుపై కేంద్ర మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

MLC Kavitha Arrest Enforcement Directorate ED: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ABP Desam Last Updated: 16 Mar 2024 12:12 AM
కవిత అరెస్టుపై స్పందించిన కేంద్ర మంత్రి అమిత్ షా

ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. కవిత అరెస్టులో ఎలాంటి కుట్రకోణం లేదని, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం జరగలేదని చెప్పారు. హోం మంత్రి చెబితే నేతలను అరెస్ట్ చేయడం లాంటివి జరగవని, కోర్టు ఆదేశాలను దర్యాప్తు సంస్థలు పాటిస్తాయన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ ఎప్పటినుంచో జరుగుతోందని, ఇది కొత్త ఎపిసోడ్ కాదన్నారు. ఎన్నికల సమయాన్ని దృష్టిలో ఉంచుకుని కేసుల విచారణ జరపడం ఉండదని అమిత్ షా స్పష్టం చేశారు. ఇండియా టుడే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 

నేటి రాత్రి ఈడీ కార్యాలయంలోనే ఎమ్మెల్సీ కవిత

మనీ లాండరింగ్ యాక్ట్ కింద అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేటి రాత్రి ఢిల్లీ లోని ఈడీ కార్యాలయంలోనే ఉండనున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఈడీ, ఐటీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి 4 గంటలపాటు కవితను విచారించారు. సాయంత్రం 5:20  గంటలకు ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం కారులో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి తరలించిన ఈడీ అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య కవితను ఈడీ కార్యాలయానికి తరలించారు. నేటి రాత్రికి కవితను ఈడీ కార్యాలయంలోనే ఉంచనున్నారని సమాచారం. శనివారం మధ్యాహ్నం కవితను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఓవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను విచారించేందుకు అధికారులు తమ కస్టడీ కోరనున్నారు. మరోవైపు తన అరెస్టును కోర్టులో ఛాలెంజ్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేయనున్నారు.

అధికార దుర్వినియోగం కేంద్రానికి అలవాటే, మేం పోరాటం చేస్తాం: కేటీఆర్

రాజకీయంగా లబ్ది పొందడానికి అధికారం దుర్వినియోగం చేయడం బీజేపీకి పరిపాటిగా మారిందని కేటీఆర్ ఆరోపించారు. గత 10 సంవత్సరాలలో ఇలాంటివి చేయడం బీజేపీకి అలవాటేనని విమర్శించారు. 


మార్చి 19వ తేదీన ఈ అంశం సుప్రీంకోర్టులో విచారణకు రానుండగా.. అంత హడావుడిగా ఎందుకు అరెస్ట్ చేశారని న్యాయస్థానానికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ ఈడీ అధికారులు కవితను ఎందుకు అరెస్ట్ చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. ఎప్పటికైనా నిజం గెలుస్తుందని, తాము చట్ట ప్రకారం పోరాటం చేస్తామని ఎక్స్ లో కేటీఆర్ పోస్ట్ చేశారు. 

బీజేపీకి కేసీఆర్ లొంగలేదు, అందుకే కవితను అరెస్టు: జగదీష్ రెడ్డి

కవిత అరెస్టు రాజకీయ కుట్రకోణంలో చూస్తున్నాం: జగదీష్ రెడ్డి మాజీమంత్రి


ఈడీ అధికారులకు కవిత అన్నీ ఆధారాలు ఇచ్చారు


ఢిల్లీ నుండి వచ్చినప్పుడే ఫ్లైట్ టిక్కెట్స్ బుక్ చేసుకుని వచ్చారు


బీజేపీ కేంద్ర ప్రభుత్వ సంస్థలను జేబు సంస్థలుగా మార్చుకుంది


మహిళలకు పి.ఎల్.ఎం.ఎ యాక్ట్ లో మహిళలకు మినహాయింపు ఉండాలని చెప్పింది


రాజకీయ ప్రత్యర్ధులను లొంగదీసుకోవడానికి బీజేపీ కుట్రలు చేస్తోంది


ప్రతిపక్ష పార్టీలకు నోటీసులు ఇవ్వడం...వారు బీజేపీలో చేరగానే కేసులు లేకుండా చేశారు


బీజేపీకి కేసీఆర్ లొంగలేదు కాబట్టి కవితను అరెస్టు చేశారు

ఎమ్మెల్సీ కవిత అరెస్టు అక్రమం, అప్రజాస్వామికం: హరీష్ రావు

మాజీ మంత్రి ,ఎమ్మెల్యే హరీష్ రావు ,బీ ఆర్ ఎస్ నేతల ప్రెస్ మీట్ @ తెలంగాణ భవన్ 


ఎమ్మెల్సీ కవిత అరెస్టు అక్రమం,అప్రజాస్వామికం,అనైతికం 


కావాలనే శుక్రవారం రోజు కవితను పధకం ప్రకారం అరెస్ట్ చేశారు
శని ఆదివారాలు కోర్టుకు సెలవులు అని కక్షతో అరెస్టు చేశారు 


సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా కవితను అరెస్టు చేశారు


అనేక సార్లు కవితను అరెస్టు చేస్తామని బీజేపీ నేతలు చెప్పారు


బిఆర్ఎస్ పార్టీని,కేసీఆర్ ను డిమొరలైజ్ చేసే ప్రయత్నం బీజేపీ,కాంగ్రెస్ కలిసి చేశాయి


కుట్రలు బిఆర్ఎస్ పార్టీకి కొత్తకాదు


కవిత అరెస్టుపై న్యాయపోరాటం చేస్తాము


అక్రమ అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాము


ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఈడీకి సుప్రీంకోర్టు చెప్పింది


రేపు ఎన్నికల షెడ్యూల్ వస్తుందనగా ఈ రోజు కవితను అరెస్ట్ చేశారు


19 వ తేదీన సుప్రీం కోర్టు లో వాదనలు ఉంటే హడావుడిగా ఎందుకు అరెస్ట్ చేశారు


బీజేపీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది


మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం బీజేపీ చేసింది


కవిత అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు చేయాలని పిలుపునిస్తున్నాం


కాంగ్రెస్,బీజేపీ ల కుమ్మక్కు కవిత అరెస్టుతో అర్ధం అయింది


ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు ఓటమి తప్పదు


ముందు సెర్చ్ అని ఆ తర్వాత అరెస్టు అన్నారు


ముందే ఫ్లైట్ టిక్కెట్స్ బుక్ చేసుకున్నారు


ఉద్యమాలు మాకు కొత్త కాదు

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కవిత

ఎమ్మెల్సీ కవిత శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈడీ అధికారులు ఆమెను పీఎంఎల్ఏ యాక్ట్ సెక్షన్ 19 కింద అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలిస్తున్నారు. శంషాబాద్ నుంచి విమానంలో కవితను ఢిల్లీకి తరలిస్తున్నారు ఈడీ అధికారులు.

అణిచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటామన్న ఎమ్మెల్సీ కవిత

అరెస్టు తర్వాత ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారుల బృందం ఢిల్లీకి తరలిస్తోంది. ఇలాంటి అణిచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటామని కవిత అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు మనోధైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. అరెస్ట్ అనంతరం పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ వెళ్లిపోయారు కవిత. ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా పార్టీ శ్రేణులను సీనియర్ నాయకులు సముదాయించారు. దొంగ కేసులను రాజకీయ కక్ష సాధింపు చర్యలను చట్టం ప్రకారం ఎదుర్కొంటామని కవిత అన్నారు. 

ఎమ్మెల్సీ కవితను శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తరలిస్తున్న ఈడీ అధికారులు

ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఆమెను శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తరలిస్తున్నారు. రాత్రి 8:45 కి విమానంలో ఢిల్లీకి తరలిస్తారని సమాచారం.

మోదీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు

బీఆర్ఎస్ నేతలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కవిత నివాసం వద్దకు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవిత అరెస్ట్ అక్రమమని, కుట్రపూరితంగా ఆమెను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు.

కవిత అరెస్ట్ - ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత ఇంట్లోకి వెళ్లిన హరీష్ రావు, కేటీఆర్ అధికారులతో వాదనకు దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ.. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను కేటీఆర్ ప్రశ్నించారు. అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు తెలిపి ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారంటూ నిలదీశారు. అధికారులు కోర్టుల ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 

Background

MLC Kavitha was detained by the authorities in Delhi liquor Case  :  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు అరెస్ట్ నోటీసులు ఇచ్చారు. ఆమెను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఉదయం నుంచి సోదాలు చేస్తున్న అధికారులు ఇంట్లో ఉన్న అందరి వద్ద ఫోన్లను ముందే సీజ్ చేశారు.  బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెంబర్‌ 3లో ఉన్న కవిత నివాసంలోనే ఉన్న ఈడీ అధికారులు ఆమెకు అరెస్ట్‌ వారంట్‌తో పాటు సెర్చ్‌ వారెంట్‌ ఇచ్చారు. దీనికి సంబంధించి కవితతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు నోటీసులిచ్చినట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం నుంచి  కవిత ఇంట్లో సోదాలు చేస్తున్నారు 12 మంది అధికారులు.  ఇద్దరు మహిళా అధికార్లతోపాటు పదిమంది అధికారుల తనిఖీలు నిర్వహించారు.  కవితను అరెస్ట్ చేస్తారన్న సమాచారం బయటకు రావడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కవిత నివాసం వద్దకు తరలి వచ్చారు.  బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 


ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆమెకు అరెస్ట్ నోటీసులు ఇచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి దాదాపు నాలుగైదు గంటలపాటు ఈడీ, ఐటీ అధికారులు కొన్ని బృందాలుగా ఏర్పడి ఎమ్మెల్సీ కవిత నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో సాయంత్రం కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కవితకు నోటీసులు సమాచారం అందుకున్న కేటీఆర్, హరీష్ రావు ఆమె నివాసానికి చేరుకున్నారు.


కవిత అరెస్ట్ అక్రమమని కేటీఆర్, హరీష్ రావు ఆరోపించారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను కేటీఆర్ ప్రశ్నించారు. అరెస్టు చేయకూడదంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత కవితను ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారని అధికారులను కేటీఆర్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో చెప్పిన మాటను ఎందుకు తప్పుతున్నారు, తరువాత మీరు కోర్టు నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులను కేటీఆర్ హెచ్చరించారు. కావాలని శుక్రవారం వచ్చి కవితను అరెస్ట్ చేశారని కేటీఆర్ ఆరోపించారు. సోదాలు ముగిసిన తర్వాత కూడా కవిత ఇంట్లోకి రావద్దు అంటూ హుకూం ఎలా జారీ చేస్తారంటూ మండిపడ్డారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.