Breaking News: నక్కలవాగులో విద్యార్థి గల్లంతు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
ABP Desam Last Updated: 07 Dec 2021 08:05 PM
Background
వాయువ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం కొనసాగుతోంది. జవాద్ తుపాను ఒడిశాలోని పూరీకి సమీపంలో బలహీనపడి తీరాన్ని దాటింది. అయితే పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి బలహీన పడుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర మట్టానికి...More
వాయువ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం కొనసాగుతోంది. జవాద్ తుపాను ఒడిశాలోని పూరీకి సమీపంలో బలహీనపడి తీరాన్ని దాటింది. అయితే పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి బలహీన పడుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని, దాని ఫలితంగా ఏపీలో మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అధికారులు వెల్లడించారు. జవాద్ తుఫాను అల్పపీడనంగా మారి బలహీనపడటంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర కోస్తాంధ్రతో పాటు యానాం ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. అయితే రేపటి నుంచి రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు నిలకడగా ఉంది. వెండి ధరలో మాత్రం స్వల్ప పెరుగుదల కనిపించింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.44,760 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.48,830 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.65,600గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,760 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,830గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,600 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,760 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,830గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,600గా ఉంది.తెలంగాణలో..హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి. ఇక వరంగల్‌లోనూ మూడు రోజులుగా ఇంధన ధరలు నిలకడగానే ఉంటుండగా.. తాజాగా పెరిగాయి. పెట్రోల్ ధర రూ.0.19 పైసలు పెరిగి రూ.107.88 అయింది. డీజిల్ ధర రూ.0.17 పైసలు పెరిగి రూ.94.31 గా కొనసాగుతోంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.నిజామాబాద్‌లో ఇంధన ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.06 పైసలు తగ్గింది. దీంతో లీటరు ధర రూ.110.40 గా ఉంది. డీజిల్ ధర రూ.0.06 పైసలు పెరిగి రూ.96.66 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.65గా ఉంది. పాత ధరతో పోలిస్తే ఏకంగా రూ.0.34 పైసలు తగ్గింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.95.74గా ఉంది. ఇది ఏకంగా రూ.0.31 పైసలు తగ్గింది. ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు స్వల్పంగా తగ్గింది. లీటరుకు రూ.0.28 పైసలు తగ్గి ప్రస్తుతం రూ.110.43 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.26 పైసలు తగ్గి రూ.96.51గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
నక్కలవాగులో విద్యార్థి గల్లంతు
చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని నక్కలవాగు దాటుతూ 6వ తరగతి విద్యార్థి గల్లంతయ్యాడు. స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విద్యా్ర్థి వెంకటాపురానికి గ్రామానికి చెందినవాడని తోటి విద్యార్థులు అంటున్నారు. విషయం తెలిసిన విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనల చెందుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే వాగులో 20 రోజుల ఒకరు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.