Breaking News: భారత్ లో నాలుగో ఒమిక్రాన్ కేసు... ముంబయి వచ్చిన యువకుడికి పాజిటివ్

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 04 Dec 2021 07:55 PM

Background

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుపాను... ఉత్తర,వాయవ్య దిశగా కదులుతోంది. గంటకు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో తీరం వైపునకు దూసుకొస్తోంది. విశాఖకు 250కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 360కిలోమీటర్లు, పూరీకి 430కిలోమీటర్లు, పారాదీప్‌నకు 510కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. జవాద్ తుపాను రేపు...More

భారత్ లో నాలుగో ఒమిక్రాన్ కేసు... ముంబయి వచ్చిన యువకుడికి పాజిటివ్

భారత్‌లో నాలుగో ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఇదివరకే కర్ణాటకలో ఇద్దరికి,  గుజరాత్ లో ఒకరికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా గుర్తించారు. తాజాగా మహారాష్ట్రలో మరో వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. ముంబయికి వచ్చిన 33 ఏళ్ల యువకుడికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆపై జరిపిన టెస్టుల్లో ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయింది. దీంతో భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4కు చేరుకుంది.