Kanne Prakash: సికింద్రాబాద్ హస్మాత్ పేట్ చెరువు ఎఫ్టీఎల్ స్థలాల్లో టీఆర్ఎస్ నాయకులు ఇల్లు కట్టుకోవడం ఏంటని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కన్నె ప్రకాష్ ప్రశ్నించారు. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్ పల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో కన్నె ప్రకాష్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే, కార్పొరేటర్ అండదండలతో భూములన్నీ కబ్జా చేసేశారని ఆరోపించారు. అక్రమ నిర్మాణాల్లో.. టీఆర్ఎస్ నాయకులు కార్యక్రమాలు చేయడం వాటిల్లో ఎమ్మెల్యే పాల్గొనడం శోచనీయం అన్నారు. అక్రమ నిర్మాణదారులు మరింత రెచ్చిపోవడానికి ఆస్కారం ఉందని చెప్పారు. ఇటీవులే ఎమ్మార్వో అక్రమ నిర్మాణాలను తోలగించాలని జీహెచ్ఎంసీ అధికారులకు అదేశాలు ఇచ్చినప్పటికి పట్టించుకోలేదని వివరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఎఫ్టీఎల్ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. నిర్మాణ దారుడు పోచయ్య మాట్లాడుతూ.. ఇది ఎఫ్టీఎల్ భూమి కాదని తెలిపారు. అందుకే మేము ఈ స్థలాన్ని కొనుగోలు చేసుకొని నిర్మించుకున్నామని పేర్కొన్నారు.
మరోవైపు బండి సంజయ్ ఫైర్..
కేసీఆర్ బయట పెట్టిన ఫామ్ హౌస్ వీడియోల్లో ఏమీ లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. కేసీఆర్ చూపించిన వీడియోల్లో ఏమీలేదు. ఫస్ట్ షో.. సెకండ్ షో అన్నాడు. చివరికి కామెడీ షో అయింది. కేసీఆర్‌ను చూసి జనం నవ్వుకుంటున్నారని సెటైర్ వేశారు. ఢిల్లీ లిక్కర్ కేసు నుంచి దృష్టి మరల్చేందుకే ఇదంతా చేస్తున్నారు. లిక్కర్ కేసులో ఎప్పుడైనా అరెస్ట్‌లు జరగొచ్చని స్పష్టం చేశారు. ఫామ్‌హౌస్ స్క్రిప్ట్ అంతా ఢిల్లీలోనే తయారైంది. కేసీఆర్ ఢిల్లీ నుంచి రాగానే సీఎస్, డీజీపీని పిలిపించాడు. వాళ్లకు ఫామ్‌హౌస్ ఎపిసోడ్ మొత్తం వివరించారు. ఫామ్‌హౌస్‌లో నేనింతే.. నా బతుకు ఇంతే అనే సినిమా తీశారు. ఆ ముగ్గురు నకిలీ గ్యాంగ్‌ను పీఎస్‌కు తీసుకెళ్లారు. ఆ నలుగురు ఆణిముత్యాలను మాత్రం ప్రగతిభవన్‌కు తీసుకెళ్లారన్నారు.
పోకిరి సినిమాలో సీన్ ప్రకారమే కేసీఆర్ ఫామ్ హౌస్ స్క్రిప్ట్
ఈ ఎపిసోడ్‌లో డబ్బులు ఎక్కడా చూపించలేదు. 26న ఘటన జరిగితే.. సాక్షుల సంతకాలు 27న ఎలా తీసుకుంటారని బండి సంజయ్ ప్రశఅనించారు. ఇదంతా ప్లాన్ ప్రకారం కేసీఆర్ డైరెక్షన్‌లోనే నడిచింది. అమిత్‌షా పేరు చెప్పినంత మాత్రాన ఆయనతో సంబంధాలు ఉన్నట్లేనా?. తుషార్‌కు బీజేపీతో ఎలాంటి సంబంధం లేదు' అని స్పష్టం చేశారు. కేసీఆర్ వీడియోలు ప్రదర్శిస్తే.. మేమూ కొన్ని సినిమాలు చూపిస్తామంటూ.. కొన్ని క్లిప్పులు ప్లే చేశారు. . పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్.. షాయాజీ షిండేకు మధ్య జరిగిన సన్నివేశాన్ని ప్రదర్శించిన బండి.. అందులో ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగులను ఈ కేసుకు అన్వయిస్తూ కౌంటర్ వేశారు. కొందరు నేతలు టీఆర్ఎస్‌లోకి రాకముందు చేసిన విమర్శలకు సంబంధించి వీడియోలను ప్రదర్శించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎప్పుడైనా అరెస్టులు
లిక్కర్ కేసులో ఎప్పుడైనా అరెస్ట్‌లు జరగవచ్చని, లిక్కర్ స్కామ్ కేసును డైవర్ట్ చేసేందుకే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని సంజయ్ మండిపడ్డారు. నలుగురు ఎమ్మెల్యేల స్టేట్‌మెంట్లను రికార్డ్ చేయలేదన్నారు. లిక్కర్ కేసు నుంచి ఎమ్మెల్సీ కవితను కాపాడుకోవడానికే ఈ డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. లిక్కర్ కేసుపై ఇప్పటివరకు ఎందుకు మాట్లాడట్లేదని కేసీఆర్‌ను బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ భయపడుతున్నారని దేశమంతా చర్చించుకుంటున్నారని తెలిపారు. బయటికి వెళ్దామనుకునే ఎమ్మెల్యేను బయపెట్టేందుకే.. ఈ సినిమా అని ఆరోపించారు. కుమారుడు, కుమార్తెను కాపాడుకునేందుకు కేసీఆర్ ఎంతకైనా తెగిస్తారని బండి సంజయ్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలకు కూడా రక్షణ కల్పించాలని హైకోర్టును బండి సంజయ్ కోరారు. ఆ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు హైకోర్టులో పిటిషన్లు వేయాలని సూచించారు.