Bandi Sanjay : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు నిలుపుదల చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని బండి సంజయ్ ఖండించారు. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక్క పథకాన్ని నిలిపివేయబోమని మరింత మెరుగ్గా అమలు చేస్తామని ప్రకటించారు. నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో ముగిసిన బండి సంజయ్ పాదయాత్ర ముగిసింది. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఆయన కేసీఆర్‌పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పంజాబ్ రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో దేశమంతా నవ్వుకుంటోందని బండి సంజయ్ కుమర్ వ్యాఖ్యానించారు. ధరణి పోర్టల్ లోపాల పుట్ట అని... ప్రభుత్వ పొరపాట్లతో లక్షలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.
సర్కార్ తీరువల్ల భూమి ఉన్నా రైతు బంధు, రైతు బీమా, పంట నష్టపరిహారం అందడం లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను రద్దు చేశారనే ఆరోపణలను తిప్పికొట్టారు. ‘‘గత పాలకులు ప్రవేశపెట్టిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని రద్దు చేయబోంది. మరింత మెరుగ్గా అమలు చేసి తీరుతాం’’అని పునరుద్టాటించారు. రాష్ట్రాన్ని దివాళా తీయించి వేల కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుంబం ఆ సొమ్మును లిక్కర్, క్యాసినో దందాల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. పేదోళ్ల సమస్యలు, బాధలను తెలుసుకోవాలని మోడీ ఆదేశిస్తేనే... పాదయాత్ర చేస్తున్నానని.. తెలంగాణలో పేదోళ్ల ప్రభుత్వం రావాల్నారు. తెలంగాణకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 2,40,000 ఇండ్లను మోడీ మంజూరు చేశారు రూ.4000 కోట్ల రూపాయలను విడుదల చేశారన్నారు. మహారాష్ట్రలో సంవత్సరం లోపు ఇండ్లను కట్టి, పేదలతో దసరా రోజు గృహప్రవేశం చేయించారని.. కానీ కేసీఆర్ ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదన్నారు.
కేసీఆర్ పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడని.. కెసిఆర్ కూతురు అక్రమంగా సంపాదించిన వేలకోట్ల సొమ్మును, ఢిల్లీలో పెట్టుబడి పెట్టిందన్నారు. కవిత క్యాసినో లో కూడా పెట్టుబడులు పెట్టిందని విమర్శించారు. ఈ ఊరికి బస్సు లేదు, రోడ్లు లేవు, ఇండ్లు లేవుస్కూల్స్ ఉంటే... టీచర్లు ఉండరు. టీచర్స్ ఉంటే... స్కూలు ఉండదు. స్కూల్ బిల్డింగులు అసలే ఉండవు 8 ఏళ్లుగా ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు కానీ.. తన కుటుంబంలో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నారని కేసీఆర్‌పై మండిపడ్డారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయలేదని బండి సంజయ్ విమర్శించారు. రైతు రుణమాఫీ చేయలేదు..24 గంటలు ఉచిత కరెంటు ఇవ్వడం లేదన్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో... ఎప్పుడు పోతుందో కూడా తెలియదని.. కానీ ఇప్పుడు మరోసారి కరెంటు బిల్లులను పెంచేందుకు చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ 100 రూములతో ఇండ్లు కట్టుకున్నాడు. 300 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. కోటీశ్వరుడు అవుతున్నాడు... కానీ రైతులు మాత్రం అప్పుల పాలవుతున్నారన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల కోట్ల రూపాయల విలువైన జాగాలను కబ్జా చేసేందుకే 'ధరణి' తెచ్చిండని.. బిజెపి ప్రభుత్వం ఏర్పడితే.... ఉచిత విద్య, ఉచిత వైద్యం, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.