Bandi Sanjay: ఎస్టీ అభ్యర్థి ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా చేసింది బీజేపీయే అంటూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు క్రమ శిక్షణతో పాటు దేశ భక్తి కూడా మెండుగా ఉందని అన్నారు. ఆదివాసీ తెగకు చెందిన ద్రౌపది ముర్మును బేజీపీ రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడితే మద్దతు తెలపాల్సిన టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆమెను ఎలా అవమాన పరిచాయో అందరూ చూశారంటూ వ్యాఖ్యానించారు. కారు, హస్తం గుర్తు వాళ్లంతా ఏకమై ఆమెను ఓడించేందు కలిసి పన్నాగం పన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద గరిజను మహిళకు రాష్ట్రపతి అయ్యే హక్కు లేదా అంటూ ప్రశ్నించారు.
కాంగ్రెస్, టీఆర్ఎస్ లు పొత్తుగానే పని చేస్తున్నాయి..
టీఆర్ఎస్, కాంగ్రెస్ లు ద్రౌపది ముర్మును ఎందుకు వ్యతిరేకించారో సమాధానం చెప్పాల్సిందేనని బండి సంజయ్ కుమార్ అన్నారు. పార్లమెంట్ లో కూడా రెండు పార్టీలు కలిసే పని చేస్తున్నాయని చెప్పారు. ఈ రెండు పార్టీలు కలిసే దేశంలో, రాష్ట్రంలో ఒక్కటిగా ఉండే ముందుకు సాగుతున్నాయని వివరించారు. గత ఎన్నికల్లో కూడా కలిసే పోటీ చేశాయని స్పష్టం చేశారు. గిరిజనులు ఎవరూ ఊహించలేని విధంగా... వారి సామాజిక మహిళకు రాష్ట్రపతిగా పనిచేసే అవకాశం వచ్చేలా చేసింది బీజీపేయే అంటూ వ్యాఖ్యానించారు.
ఎస్సీ అభ్యర్థిని రాష్ట్రపతి చేసింది కూడా బీజేపీనే..
రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళను నిలబెడితే ఓడించేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఏమేం చేశాయో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని, గుర్తుంచుకోవాలని సంజయ్ కుమార్ సూచించారు. గతంలో ఎస్సీ అభ్యర్థి రామ్ నాథ్ కొవింద్ ను రాష్ట్రపతిగా చేసిన ఘనత కూడా బీజేపీదేనని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కూడా జేపీ నడ్డా, మోదీ ఆధ్వర్యంలో పేదలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు.
మొన్నేమో బియ్యం పంపిణీ చేయకుండా ఇబ్బందులు..
అలాగే మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న బియ్యాన్ని కూడా టీఆర్ఎస్ పేద ప్రజలకు అందించలేకపోయిందని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ రాసిన లేఖలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా అనేక అవాస్తవాలు ఉన్నాయని తెలిపారు. కేసఈఆర్ వి అన్ని అబద్ధపు మాటలే అని తెలిపారు. అవన్నీ అవాస్తవాలని కేంద్రర మంత్రి పీయూష్ గోయల్ ఆధారలతో సహా తేల్చి చెప్పారని.. అలాగే రాష్ట్రంలో తక్షణ బియ్యం సేకరణ ప్రారంభించారని వివరించారు. రైతుల జీవితాలతో రాజకీయం చేస్తుంటే తాము అస్సలే సహించలమేని... పేజ ప్రజల పక్షానే తామెప్పుడూ నిలుస్తామంటూ బండి సంజయ్ వివరించారు.
అంతే కాకుండా రాష్ట్రంలో వరదల వల్ల సంభవించిన నష్టాన్ని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అమిత్ షాక్ వివిరించగా.. రాష్ట్రానికి కేంద్ర హోం శాఖ ఆ్వర్యంలో ఉన్నత స్థాయి బృందాన్ని పంపేందుకు ముందుకొచ్చారని బండి సంజయ్ తెలిపారు. రాష్ట్రంలో హైపవర్ కమిటీ పర్యటించి ఇటీవల కురిసిన వర్షానికి జిరిగిన నష్టాన్ని అంచనా వేస్తారని వివరించారు. ఆ తర్వాత ఆ నివేదికను కేంద్రానికి పంపుతారని బండి సంజయ్ వెల్లడించారు.