Breaking News Telugu Live Updates: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఇంజినీరింగ్ శాఖలో పోస్టుల భర్తీకి ఆదేశాలు

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 02 Jul 2022 03:53 PM
నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఇంజినీరింగ్ శాఖలో పోస్టుల భర్తీకి ఆదేశాలు

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంజినీరింగ్ శాఖలో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల చేసింది. 

హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ

ప్రధాని మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. బేగంపేట్ ను ప్రత్యేక హెలికాఫ్టర్ లో ప్రధాని మోదీ హెచ్ఐసీసీకి వెళ్లారు. ప్రధాని మోదీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. 

Eknath Shinde Suspension: శివసేన నుంచి ఏక్ నాథ్ షిండే బహిష్కరణ

మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండేను పార్టీ నుంచి బహిష్కరించారు. కొత్త సీఎం షిండే ఎల్లుండే బల పరీక్ష ఎదుర్కోనున్నారు.

KCR About PM Modi: మోదీజీ ప్రసంగాలు కాదు, మాకు జవాబులు కావాలి: జలవిహార్ సభలో కేసీఆర్

ఎలక్టోరల్ కాలేజీలోని సభ్యులు రాష్ట్రపతి అభ్యర్థులు ఇద్దరి గుణగుణాలు చూసి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని, ప్రజాస్వామ్యంలో మాట్లే స్వేచ్ఛ ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం నేడు హైదరాబాద్ వస్తున్నారు. ఆయన తన నోటికొచ్చినట్లు మా రాష్ట్ర ప్రజలపై, నేతలపై ఆరోపణలు చేస్తారని కేసీఆర్ ఆరోపించారు. మా అన్నదాతలు చనిపోతున్నా పట్టించుకోలేదు, గొంతు చించుకుని మాకు వ్యతిరేకంగా మాట్లాడి వెళ్లిపోయే వ్యక్తి ప్రధాని మోదీ అని పేర్కొన్నారు. ఉద్వేష పూరిత ప్రసంగాలు చేయడం ఆపి, మా ప్రజలకు, రైతులకు ఏం చేశారో చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన అన్యాయంపై మేం అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వాలని ప్రధాని మోదీని ప్రశ్నించారు.

నెక్లెస్ రోడ్‌లో నిరసన - అంజన్ కుమార్ యాదవ్‌ అరెస్ట్

అంజన్ కుమార్ యాదవ్ అరెస్ట్...
నెక్లెస్ రోడ్ లో ఇందిరా గాంధీ విగ్రహం వద్ద బీజేపీ, టీఆర్ఎస్ జెండాలు తొలగించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ నిరసన..


ఇందిరా గాంధీ విగ్రహం వద్ద అంజన్ కుమార్ యాదవ్ ను అరెస్ట్ చేసి నాంపల్లి పోలీసు స్టేషన్ కు తరలించిన పోలీసులు.

Bandi Sanjay Questions KCR: ఊర్లనే ఉంటవా.. ఊర్లు పట్టుకొని తిరుగుతవా దొరా?: కేసీఆర్‌కు బండి సంజయ్ ప్రశ్న

ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ నగరానికొస్తే జ్వరమని ఫార్మ్ హౌస్‌ల పన్నవ్.. మొన్న హైదరాబాద్ వస్తే పక్కరాష్ట్రానికి జారుకున్నవ్.. ఈసారి 2 రోజులు మోదీ ఇక్కడనే ఉంటున్నారు. ఇప్పుడైనా ఊర్లనే ఉంటవా ? ఊర్లు పట్టుకొని తిరుగుతవా దొరా? నీ మేకపోతు గాంభీర్యాలు బరాబర్ బయటపెడతము అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ట్వీట్ చేశారు. #SaaluDoraSelavuDora

Yashwant Sinha Arrives in Hyderabad: బేగంపేటలో యశ్వంత్ సిన్హాకు ఘనస్వాగతం పలికిన సీఎం కేసీఆర్

బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న యశ్వంత్ సిన్హాకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. 

AICC కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హౌస్ అరెస్ట్

ఆర్మీలో 4 యేళ్ల తాత్కాలిక ఒప్పందంపై తీసుకుంటున్న అగ్నిపథ్ స్కీమ్ నోటిఫికేషన్ వ్యతిరేకంగా టీపీసీసీ ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తారని మరియు రాష్ట్రంలో TRS కేంద్రంలో BJP అధికారంలోకి వస్తే 100 రోజులో SC వర్గీకరణ చేస్తామని మాట తప్పి.. నేడు తెలంగాణకు వస్తున్న ప్రధాని మోడీ మరియు కేంద్ర మంత్రుల రాకను నిరసిస్తూ BJP కి వ్యతిరేకంగా MRPS తలపెట్టిన సడక్ బందులో పాల్గొంటాడాని AICC కార్యదర్శి మాజీ MLA S A సంపత్ కుమార్ గారిని శాంతి నగర్  పోలీసులు తన క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్బంధం చేయడం జరిగింది.

Tirumala News Updates: తెలంగాణలో బీజేపీ పుంజుకుందని అనుకోవడం భ్రమ: ఎమ్మెల్యే

తిరుపతి: తిరుమల శ్రీవారిని‌ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో‌ కేంద్ర మంత్రి ఫాగ్గన్ సింగ్ కులస్తే, తెలంగాణ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ లు కుటుంబ సమేతంగా వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల‌ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు‌ పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల  ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ పుంజుకుందని అనుకోవడం ఓ భ్రమ అన్నారు.. కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి అభ్యర్థులు కూడా దొరకడం లేదని, తెలంగాణలో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావడం తధ్యంమని ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు..

పాతబస్తీలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు 10వేల మందితో బైక్ ర్యాలీ

చార్మినార్ వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా శనివారం హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు 10వేల మందితో బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దీంతో చార్మినార్ నుంచి వీరు బైక్ ర్యాలీ చేపట్టడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు బీజేపీ ప్లీనరీలో పాల్గొనేందుకు నేడు ప్రధాని నరేంద్ర మోదీ సైతం హైదరాబాద్‌కు రానున్నారు. 

Background

ఎప్పుడైతే బీజేపీ తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలిచిందో ఇక అప్పటి నుంచి మాంచి రాష్ట్రంలో పార్టీ ఫామ్‌లోకి వచ్చింది. దీనికి తోడు రాష్ట్రానికి చెందిన బండారు దత్తాత్రేయ, కిషన్‌ రెడ్డి వంటి వారికి ఉన్నత పదవులు కట్టబెట్టడంతో తెలంగాణపై పట్టుసాధించే ప్రయత్నం చేసింది బీజేపీ అధిష్టానం. ఈ ఊపులో మరింతగా పనిచేసిన బీజేపీ శ్రేణులకు దుబ్బాక బైపోల్ ధీమానిచ్చింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్‌ రావు గెలుపు పార్టీలో జోష్‌ నింపింది. ఆ తర్వాత జరిగిన జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లో అధికారపార్టీకి గట్టి పోటీనివ్వడంతో ఇక కమలానికి కొండంత బలం పెరిగినట్టైంది. ఇది చాలదన్నట్లు సీఎం కీసీఆర్‌కు దూరమై పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన ఈటల రాజేందర్ గెలుపు కూడా బీజేపీకి కలిసొచ్చింది. తెలంగాణ డిక్లరేషన్, టార్గెట్ సీఎం కేసీఆర్‌గా బీజేపీ తమ ప్లీనరీని హైదరాబాద్‌లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.


నైరుతి రుతుపవనాల తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో విస్తరించడంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో శుక్రవారం తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. జూలై 4 నాటికి ఉత్తర ఒడిశా దాని పరసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. ఏపీలోని కోస్తాంధ్రలో నేటి నుంచి మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనుండగా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలోని ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుల సూచన, వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 


ఉత్తర భారత దేశద్వీపకల్పం 19 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి గాలుల సముద్ర మట్టానికి 3.1 నుంచి 7.6 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగి బలహీన పడింది. తూర్పు పడమర ద్రోణి ఇప్పుడు పంజాబ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు దక్షిణ ఒడిశా తీరం నుంచి హరియాణా, దక్షిణ ఉత్తర ప్రదేశ్, ఈశాన్య మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించి కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం మధ్య తీర ప్రాంత ఒడిశా, పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తులో దక్షిణం వైపు వంగి ఉంటుంది. 


బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజులు పుంజుకున్న బంగారం ధరలు నేడు దిగొచ్చాయి. మరోవైపు వెండి ధర వరుసగా నాలుగో రోజు పతనమైంది. వెండిపై రూ.200 తగ్గడంతో 1 కేజీ ధర రూ.65,000కి పతనమైంది. రూ.1,300 పెరగడంతో  తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,200కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,850 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు నేడు హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.65,100 అయింది. కరీంనగర్, వరంగల్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,200, 22 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.47,850 అయింది. 


నేడు ఏపీలో బంగారం ధర.. ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరగడంతో విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,200 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,850 గా ఉంది. విజయవాడలో స్వచ్ఛమైన వెండిపై రూ.200 తగ్గడంతో 1 కేజీ ధర రూ.65,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. 


హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర (Petrol Price Today 2nd July 2022) రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వద్ద పాత ధరలకే విక్రయిస్తున్నారు. 


తెలంగాణలో ఇంధన ధరలు..
నేడు వరంగల్‌లో పెట్రోల్ ధర నిలకడగా ఉంది. నేడు పెట్రోల్ లీటర్ ధర రూ.109.16 కాగా, డీజిల్‌‌ లీటర్ ధర రూ.97.35 అయింది. 
వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ పై 18 పైసలు తగ్గి పెట్రోల్‌ లీటర్ ధర రూ.109.38 కాగా, 16 పైసలు తగ్గడంతో డీజిల్‌‌‌ లీటర్ ధర రూ.97.39 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. కరీంనగర్‌లో ఇంధన ధరలు స్వల్పంగా తగ్గాయి. 46 పైసలు తగ్గడంతో కరీంనగర్‌లో పెట్రోల్ పై 15 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.109.39 కాగా, 14 పైసలు తగ్గడంతో డీజిల్ ధర రూ.97.56 అయింది. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.