BJP party is fuming over BRS linking the issue of Adani : ఇండియాలో లంచాలు ఇచ్చారని అమెరికాలో నమోదైన రాజకీయంగా పెను ప్రకంపనలకు కారణం అవుతోంది. ఈ కేసు గురించి తెలిసిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పించారు. రాహుల్, మోదీ ఇద్దరూ అాదానీకి సన్నిహితులేనని ఓ ఫోటోతో విమర్శలు గుప్పించింది. అలాగే లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన తర్వాత చాలా కాలం జైల్లో ఉండి విడుదల అయిన కవిత కూడా మోదీని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.
అఖండ భారతంలో అదానికో న్యాయం...ఆడబిడ్డకో న్యాయమా ? అని ప్రధాని మోదీని కవిత ప్రశ్నించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలి సారి రాజకీయపరమైన విమర్శలు చేశారు. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీను అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అఖండ భారత్ సాధిస్తామని ప్రచారం చేశారని చివరికి సెలక్టివ్ న్యాయం పాటిస్తున్నారని మండిపడ్డారు. అదానీపై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుపడుతున్నారని ఆమె ప్రశ్నించారు.
కవిత ట్వీట్‌కు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా రిప్లై ఇచ్చారు. లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన కవితకు న్యాయం, నైతికపై మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇతరుల్ని విమర్శించే ముందు తమ సంగతేమిటో గుర్తు చేసుకోవాలన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో మోదీ, రాహుల్ అదానీ కకలసి ఉన్న ఫోటోను పెట్టి అందరూ ఒకటేనని విమర్శలు గుప్పించారు. అయితే కేసీఅర్ అదానీతో దిగిన ఫోటోను పోస్టు చేసిన విష్ణువర్ధన్ రెడ్డి .. కేసీఆర్ ను కలిసినప్పుడు మంచి అదానీ అవుతారా అని ప్రశ్నించారు.
ఇండియాలో లంచాలు ఇచ్చారంటూ అమెరికా కోర్టులో కేసు పెట్టిన అంశాన్ని రాజకీయం చేయడం .. బీజేపీకి అంటగట్టండపై ఆ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది.