BJP MP Raghunandan Rao expressed his anger on KTR:  తెలంగాణ బీజేపీ నేతలు చాలా కాలం తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అందరూ కలసి కట్టుగా పని చేయాలని సూచించారు. దీనికి సంబంధించి ఓ వార్తాపత్రికలో వచ్చిన వార్తను ట్వీట్ చేసిన కేటీఆర్.. బీజేపీ నేతలపై మండిపడ్డారు. 


కాంగ్రెస్‌తో కలిసి కలసికట్టుగా పని చేస్తున్నారన్న కేటీఆర్            


అంతా కలిసికట్టుగానే పని చేస్తున్నారు ..కాంగ్రెస్ నేతలతో కలిసిపోయి మరీ పని చేస్తున్నారన్నారు.  చోటేభాయ్ కు వ్యూహకర్తగా...
కాంగ్రెస్ కట్టర్ కార్యకర్తలుగా..  విశ్రమించకుండా పని చేస్తున్నారని ప్రధాని వార్తను రీట్వీట్ చేసి మరీ చెప్పుకొచ్‌‌చచారు. చీకటి రాజకీయ ప్రయోజనాల కోసం 'చేతి' కలుపుతూ చోటే భాయ్ కోసం కలిసి పని చేస్తున్నారన్నారు.  



అలా అయితే ఇప్పటికే జైల్లో ఉండేవాడివన్న రఘునందన్ 


కేటీఆర్ ట్వీట్‌కు ఎంపీ రఘునందన్ రావు సమాధానం ఇచ్చారు. కలిసికట్టుగా మేము కాంగ్రెస్ పార్టీతో పని చేసి ఉంటే ఈరోజు నువ్వు ఇలా ట్విట్లు పెట్టకపోవు చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూ ఉండేవాడివని జోస్యం చెప్పారు. గత పదేళ్లు అధికారంలో ఉండి అన్ని శాఖల్లో వేలు పెట్టి తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను, విద్యా వ్యవస్థను, వైద్య వ్యవస్థను చిన్నాభిన్నాం చేసిన నీలాంటి వాళ్ళ దగ్గర రాజకీయాలు ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో నేర్చుకునే దౌర్భాగ్యం మాకు పట్టలేదు. నీకు రాజకీయాలు ఎలా చేయాలో, ప్రజల సమస్యలు ఎలా నెరవేర్చాలో తెలిసి ఉంటే ఈరోజు అధికారం కోల్పోయి ఉండేవాడివి కాదన్నారు. నిన్ను నమ్మి పార్టీ బాధ్యతలు అప్పగించిన మీ నాయనే ఈరోజు ప్రజలకు ముఖం చూపలేక ఫాంహౌస్ కు పరిమితమైండు, నీ పనికిమాలిన స్టేట్మెంట్లు చూస్తుంటే నువ్వు కోల్పోయింది అధికారం మాత్రమే కాదు మెదడు కూడా కోల్పోయావని స్పష్టం అవుతుందన్నారు. 



కేటీఆర్ ట్వీట్‌పై ఇతర బీజేపీ నేతలు కూడా ఘాటుగా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.  కేటీఆర్ ను ఫార్ములా ఈ రేసులో అరెస్టు చేసేందుకు  గవర్నర్ పర్మి,షన్ ను ఏసీబీ అధికారులు ఇప్పటికే అజడిగారు.  అయితే గవర్నర్ ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. ఇదే అంశాన్ని రఘునందన్ రావు పరోక్షంగా గుర్తు చేశారు. 


'కేటీఆర్.. దిలావర్‌పూర్ రండి అక్కడే తేలుద్దాం' - మంత్రి సీతక్క సవాల్, ఫుడ్ పాయిజన్ ఘటనలపైనా సంచలన వ్యాఖ్యలు