BJP won  graduate MLC elections : భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఉత్తర తెలంగాణ   గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో అంజిరెడ్డి విజయం ఖరారైంది. అంజిరెడ్డికి 78,635 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి 73,644 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 63,404 ఓట్లు పడ్డాయి. అంజిరెడ్డి విజయం ఖరారు కావడంతో కౌంటింగ్ హాలు నుంచి నరేందర్ రెడ్డి వెళ్లిపోయారు. 

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి చివరి వరకూ గట్టిగా పోరాడారు. కౌంటింగ్ ఉత్కంఠగా సాగింది. మొదట్లో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు. కొన్ని రౌండ్లలో  కాంగ్రెస్ అభ్యర్థికి మెజార్టీ ఓట్లు వచ్చాయి. తర్వాత మళ్లీ అంజిరెడ్డి ముందుకు వచ్చారు.బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కూడా బలమైన పోటీ ఇచ్చారు.  నామినేషన్లు పూర్తయ్యే నాటికి కాంగ్రెస్, బీజేపీ క్యాండిడేట్ల మధ్యే పోటీ ఉంటుందని అనుకున్నా.. ప్రసన్న హరికృష్ణ అనూహ్యంగా మిగతా ఇద్దరు క్యాండిడేట్లకు ప్రధాన ప్రత్యర్థిగా మారారు. రాష్ట్రంలో బీసీ నినాదం బలపడుతుండడం, చివరి రెండు రోజుల్లో బీఆర్ఎస్ లీడర్లు హరికృష్ణ కోసం పని చేయడంతో రేసులోకి వచ్చారు.  నిజానికి  ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్‌‌‌‌ తరపున పోటీ చేసేందుకు ప్రయత్నించినా అవకాశం రాలేదు. 

ఆ తర్వాత బీఆర్ఎస్ తరపున పోటీ చేయాలని కూడా ప్లాన్‌ చేశారు. అది కూడా వర్కౌట్ కాలేదు. దీంతో బీఎస్పీ తరఫున బరిలోకి దిగారు.  కాంపిటీటివ్‌‌‌‌ బుక్స్‌‌‌‌ రచయితగా పేరున్న వ్యక్తి కావడంతో.. గ్రాడ్యుయేట్లకు అందులోనూ ప్రధానంగా నిరుద్యోగులకు ఆయన బాగా కనెక్ట్‌‌‌‌ అయ్యారు. చివరి నిమిషంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పరోక్ష మద్దతు కూడా కలిసొచ్చినట్లయింది. కానీ ఆయన మూడో స్థానానికే పరిమితమయ్యారు. విజయం సాధించిన బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసింది.   కేంద్రమంత్రులు కిషన్‌‌‌‌రెడ్డి, బండి సంజయ్‌‌‌‌తో పాటు ముగ్గురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు చేసిన ప్రచారం చేశారు.   ఉత్తర తెలంగాణలో పెరిగిన బలం, నిరుద్యోగులు, ఉద్యోగుల్లో బీజేపీ పట్ల సానుకూల ధోరణి ఆ పార్టీ అభ్యర్థి విజయానికి  దోహదపడ్డాయి.             

బీజేపీ విజయంలో  కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.   పట్టభద్రుల నియోజకవర్గం నాలుగు ఉత్తర తెలంగాణ ఉమ్మడి జిల్లాల్లో ఉంటుంది. అంటే టీచర్స్ నియోజవర్గాలు రెండింటిని కలుపుకుంటే 13 జిల్లా, 42 అసెంబ్లీ స్థానాలు, 270 మండలాలు, ఆరు లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరిగాయి. అన్ని చోట్లా ప్రతి గ్రాడ్యూయేట్, టీచర్ ఓటర్‌ను చేరేలా పకడ్బందీ ప్రచార ప్రణాళికను .. ప్రతి ఒక్క ఓటర్‌ను మూడు, నాలుగు సార్లు కలిసేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి కిషన్ రెడ్డి ప్రచారం చేశారు.   పట్టబద్రుల నియోజకవర్గంలో అత్యంత హోరాహోరీగా జరిగినా ఓట్లు చీల్చే వ్యూహాలను కాంగ్రెస్ పార్టీ పాటించినా బీజేపీ విజయాన్ని ఆపలేకపోయారు.