BJP Lead:  కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ కొనసాగుతోంది.  మొదటి ప్రాధాన్యత ఓట్ల మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి చిన్న మైల్ అంజిరెడ్డి 24 ఓట్లతో ముందంజ వేశారు.  మొత్తం 14 రౌండ్లు కౌంటింగ్ జరగనుంది. మొదటి రౌండ్‌లో  బీజేపీ అభ్యర్థి మైల్ అంజిరెడ్డికి 6697 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో  కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి 6673 ఓట్లతో ఉన్నారు. మూడో స్థానంలో  బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ  5897 ఓట్లు సాధించారు.

Continues below advertisement


ఆలస్యంగా జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియ 


తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. వాటిలో రెండు టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలు.  నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ల ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్‌టీయూ నేత శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు.  కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ బలపర్చిన మల్క కొమరయ్య  తొలి ప్రాధాన్య ఓట్లతోనే గెలిచారు.  కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఆలస్యంగా ప్రారంభమయింది. చెల్లని ఓట్లను పక్కన పెట్టి చెల్లే ఓట్లను కట్టలుగా కట్టడానికే ఒకటిన్నర రోజు పట్టింది.              


మొదటి ప్రాధాన్యతా ఓట్లతో గెలుపు కష్టమే                             


కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బీఎస్పీ తరపున బరిలో నిలిచిన ప్రసన్న హరికృష్ణ కూడా గట్టి పోటీ ఇచ్చినట్లుగా ఫలితాలను బట్టి తెలస్తోంది.  మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి  ఫలితం తేలకపోవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తం చెల్లుబాటు అయిన ఓట్లలో సగం వస్తేనే విజేత ప్రకటిస్తారు. లేకపోతే ఎలిమినేషన్ రౌండ్స్ లోకి వెళ్తారు. మూడో స్థానంలో ఉండే అభ్యర్థి  ఎలిమినేషన్ ద్వారానే విజేత తేలే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. 


ఉమ్మడి కరీంనగర్ ఓట్లే కీలకం                    


నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న గ్రాడ్యూయేట్లు అందరూ ఓట్లు వేసినా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. మొత్తం ఓట్లలో సగం ఆ జిల్లా నుంచే ఉన్నాయి. బీజేపీ కనేతలు యాక్టివ్ గా ఓట్లు వేయించడంతో .. అభ్యర్థి అంజిరెడ్డికి కలసి వస్తుందని అంచనా వేస్తున్నారు. తొలి రౌండ్లలో గట్టి పోటీ ఉన్నప్పటికీ ఆయన ..  స్వల్ప ఆధిక్యత చూపించడం ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో ఇదే ట్రెండ్ కొనసాగితే..  చివరి వరకూ గెలుపు ఎవరో అంచనా వేయడం కష్టమే.                                         



Also Read: Telangana Politics: రేవంత్ రెడ్డి మోదీని కలిసింది అందుకేనా? కాంగ్రెస్ సర్కార్ గడువు ఆరు నెలలేనా ?