Ghee Adulteration Case in Tirumala:  తిరుపతి: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల కల్తీ నెయ్యి కేసులో విచారణ వేగవంతం చేశారు. ‘కల్తీ నెయ్యి’ కేసులో అరెస్టైన నిందితులను సిట్ కస్టడీకి తీసుకుంది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణల కేసులో నిందితులు పొమిల్‌ జైన్‌, అపూర్వ వినయ్‌కాంత్‌ చావడాలను మూడు రోజుల సిట్‌ కస్టడీకి కోర్టు అప్పగించింది. ఏ3, ఏ5లను సిట్ కస్టడీకి అప్పగించిన కోర్టు.. ఈ కేసులో ఏ5 బెయిల్‌ పిటిషన్‌ విచారణ మార్చి 6కు వాయిదా వేసింది.

మరోవైపు ఈ కేసులో ఏ3, ఏ4ల తరఫున మళ్లీ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. ఏ3, ఏ5 గా ఉన్న పొమిల్‌ జైన్‌, అపూర్వ వినయ్‌కాంత్‌ చావడాలను తిరుపతి సబ్ జైలు నుంచి సిట్ అధికారులు విచారణకు తమ కస్టడీకి తీసుకున్నారు. అంతకుముందు తిరుపతి రుయా హాస్పిటల్ లో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఇద్దరు నిందితులను సిట్ కస్టడికి తీసుకుంది. కల్తీ నెయ్యి కేసులో నిందితులను మరోసారి విచారించి, నిజాలు రాబట్టాలని సిట్ భావిస్తోంది.