BJP Election Candidates : ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాలపై బీజేపీ హైకమాండ్ కసరత్తు ప్రారంభించింది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో అభ్యర్థులపై కసరత్తు జరిపింది. రెండు రాష్ట్రాల్లో అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా నోటిఫికేషన్ ఇవ్వకముందే మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేసింది.
బీజేపీ బలంగా ఉన్న చోట్ల మందే అభ్యర్థుల్ని రిలీజ్ చేయాలని మోదీ సూచన !
ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో అభ్యర్థులను ముందుగానే రిలీజ్ చేయాలని ప్రధాని మోదీ ఆదేశించినట్టుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించక ముందే బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసి అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తింది. గతంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మాత్రమే అభ్యర్థుల జాబితాలను ప్రకటించేవారు. ఈ సారి ముందుగానే కార్యాచరణలోకి వచచేశారు. బీజేపీ తన తొలి జాబితాలో ఛత్తీస్‌గఢ్‌కు 21 మంది అభ్యర్థులను ప్రకటించగా.. ఇందులో ఐదుగురు మహిళలున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఐదుగురు మహిళలు సహా 39 మంది అభ్యర్థులను కూడా బీజేపీ తన తొలి జబితాని ప్రకటించింది.
మధ్యప్రదేశ్‌లో అధికారంలో బీజేపీ - చత్తీస్ ఘడ్ కాంగ్రెస్ చేతిలో !
వచ్చే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి కీలకం. పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో పార్టీ ఎన్నికల సన్నాహాలను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమీక్షించిన తర్వాత ఈఅభ్యర్థుల ప్రకటన వెలువడింది. ప్రకటన వెలువడింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. పార్టీ ముఖ్య నేతలు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ చేయడానికి పార్టీకి తగినంత సమయం ఉండేలా, అభ్యర్థుల మొదటి జాబితాను త్వరగా ప్రకటించాలని ప్రధాని మోడీ బీజేపీ అగ్ర నాయకులను సూచించడంతో అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లుగా తెలు్సతోంది. 230 మంది సభ్యుల మధ్యప్రదేశ్ అసెంబ్లీకి, 90 మంది సభ్యుల ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి వచ్చేనెలలో ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణ తొలి జాబితా ఎప్పుడు ?
తెలంగాణ, రాజస్థాన్‌లలోనూ అభ్యర్థుల ఎంపికైప బీజేపీ ఎన్నికల కమిటీ సమీక్షించినప్పటికీ ఆయా రాష్ట్రాల్లో తొలి జాబితా విడుదలకు మరికొంత సమయం తీసుకోవాలని అనుకున్నారు. తెలంగాణలో తొలి జాబితా ఇప్పటికే సిద్ధమయింది. అయితే.. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకూడా అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉండటంతో.. ఎదురు చూడాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఇతర పార్టీల నుంచి బలమైన నేతలు వస్తే చేర్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.