Telangana BJP plan :   తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెల్చుకోవాలని బీజేపీ తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఇందు కోసం లక్షాన్ని డిసైడ్ చేసుకుంది.  రాష్ట్రంలో 10 ఎంపీ సీట్లు, 35 శాతం ఓటు బ్యాంకు సాధించడమే లక్ష్యంగా ఇవాళ సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ఇన్‌ఛార్జులు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్‌తోపాటు నేతలు బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌, డీకే అరుణ, ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మెజారిటీ సీట్లలో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు.        


సంస్థాగతంగా పార్టీలో మార్పులు చేర్పులపైనా చర్చలు జరిపారు.  పార్టీ శాసనసభాపక్ష నేత ఎంపికపైనా సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఎవరిని నియమించాలనేది ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తోంది. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని నియమిస్తారని ప్రచారం జరుగుతున్నా.. ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరో వైపు  పార్టీ అధ్యక్షుడు కిషన్‌ ​రెడ్డి సమక్షంలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. దేశాన్ని అనేక మంది పరిపాలించారని ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక అవినీతి మరక ఉందని, కానీ పదేళ్లుగా నరేంద్రమోదీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు.               


ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని కిషన్రెడ్డి తెలిపారు. కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు కలిసి కాంగ్రెస్​ నేతృత్వంలో ఫ్రంట్​ ఏర్పాటు చేశాయని ఎద్దేవా చేశారు.  అన్ని వర్గాల, ప్రాంతాల ప్రజలు నరేంద్ర మోదీ మరోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సర్వేలన్ని కూడా నరేంద్ర మోడీకి ఎవరూ పోటీకి దరిదాపుల్లో లేరని స్పష్టం చేశాయన్నారు. దేశంలో ఉగ్రవాదం, మతకల్లోలాను మోది అరికట్టారని ఆయన అన్నారు. దేశాన్ని అనేక మంది పరిపాలించారు.. ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక్క అవినీతి మరక అని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్లుగా నరేంద్ర మోడీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదన్నారు కిషన్‌ రెడ్డి. ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావాలని చర్చ జరుగుతోందని, ఫ్రంట్ ల పేరుతో మోడీ నీ దించాలని కుట్ర చేస్తున్నారన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు.                


అయోద్యలో జరగనున్న రామ మందిర ప్రాణ ప్రతిష్ట లో తెలంగాణ ప్రజలూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. అయోధ్య ఆలయ కార్యక్రమాలకు  బీజేపీకి సంబంధం లేదని.. అది ప్రజలందరికీ సంబంధించినదన్నారు.