Basara IIIT Students :  బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రోడ్డెక్కారు. సమస్యలు పరిష్కరిస్తామోనని వేచి చూసి చూసి ఇక సహనం కోల్పోయి పోరు బాట పట్టారు. 12 డిమాండ్ల సాధనే లక్ష్యంగా.. నిరాహార దీక్ష చేపట్టారు.  బాసర ట్రిపుల్ ఐటీ న్యాక్ హోదాలో వెనకబడిపోయిందని, తమ గోడును వినే నాథుడే లేడని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.  విద్యార్థులు టిఫిన్, మధ్యాహ్న భోజనాన్ని బహిష్కరించారు. ఈ నిరాహార దీక్షలో ఆరు వేల మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. విద్యార్థులు ఆందోళన చేపట్టడంతో.. తల్లిదండ్రులు భారీగా బాసర ట్రిపుల్ ఐటీ వద్దకు తరలి వచ్చారు. 


విద్యార్థుల తల్లిదండ్రులను  ట్రిపుల్ ఐటీ సిబ్బంది లోపలికి ్నుమతించలేదు.  ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించాలని, సీఎం కేసీఆర్ ఆర్జీయూకేటీని సందర్శించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.   రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ ను నియమించడంతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలంటూ నిరసన నినాదాలతో  హోరెత్తించారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ముందు   విద్యార్థులు ధర్నా చేశారు. యూనివర్సిటీలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గంటల తరబడి నిరసన కొనసాగిస్తున్నారు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులుయూనివర్సిటీని సందర్శించే వరకు ధర్నా ఆపేది లేదని విద్యార్థులు తేల్చి చెప్పారు. యూనివర్సిటీలో పూర్తిస్థాయి వైస్ ఛాన్స్లర్ ను నియమించాలని, ల్యాబ్ ట్యాప్ లను అందించాలని, మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని విద్యార్థుల ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. 





 విద్యార్థుల డిమాండ్లను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. 



విద్యార్థుల సమస్యలపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ప్రభుత్వ నిర్వాకం ఇలా ఉందంటూ ఆయన మండిపడ్డారు. 





 డిమాండ్లు పరిష్కరించే వరకూ .. సీఎం వచ్చే వరకూ ఆందోళన ఆగదని విద్యార్థులు అంటున్నారు.