Bandi Sanjya to appear before SIT on 8th: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ ఎనిమిదో తేదీన సిట్ ఎదుట హాజరు కానున్నారు. గతంలోనే ఆయనకు సిట్ నోటీసులు ఇచ్చింది. బ బాధితుడిగా వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని కోరింది. అయితే అప్పట్లో తీరిక లేకుండా ఉండటంతో తర్వాత వస్తానని సమాచారం ఇచ్చారు. తాజాగా ఎనిమిదో తేదీన వస్తానని పోలీసులకు లేఖ రాశారు. అదేరోజు సంజయ్ తోపాటు సిట్ విచారణకు సంజయ్ వ్యక్తిగత సిబ్బంది కూడా హాజరవుతారు.
ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర నిఘావర్గాల ద్వారా కీలక సమాచారం, ఆధారాలు సేకరించారని.. సిట్ ఎదుట కేంద్ర మంత్రి పలు ఆధారాలను సమర్పించే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో జడ్జీల ఫోన్లను సైతం ట్యాప్ చేయడంపట్ల బీజేపీ సీరియస్ గా ఉందని.. భార్యభర్తల బెడ్రూం మాటలను కూడా చేశారని గుర్తించారని అంటున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో బీజేపీ లీగల్ సెల్ పిటిషన్ దాఖలు చేసింది.
బండి సంజయ్ విజ్ఞప్తితో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ పాత్రపై ఐబీ వర్గాలు ఆధారాలు సేకరిస్తున్నాయని చెబుతున్నారు. కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని సిట్ ఎదుట రాధాకిషన్ రావు అంగీకరించారు. డీజీపీ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రభాకర్ రావు వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో ఇప్పిటకే కేసీఆర్, కేటీఆర్ ల చుట్టూ ఉచ్చు బిగుస్తోందని భావిస్తున్నారు. ఈనెల 8న బండి సంజయ్ సిట్ ఎదుట బండి సంజయ్ ఇచ్చే వాంగ్మూలం కీలకం కానుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై జాతీయ స్థాయిలో చర్చపెట్టాలని భావిస్తున్నారు.
బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు , క్తిగత సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. సిట్ దర్యాప్తులో బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్‌కు గురైన బాధితుల జాబితాలో ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. మాజీ పోలీసు అధికారి ప్రణీత్ రావు ఫోన్‌లో లభించిన రికార్డింగ్‌లు , చాట్ హిస్టరీలలో ట్యాపింగ్‌కు సంబంధించిన సమాచారం బయటపడినట్లు సిట్ తెలిపింది. ఈ కేసులో బండి సంజయ్‌తో పాటు నాడు పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, వివేక్ వేంకటస్వామి వంటి ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ చేయలేదని అనుకుంటున్నానని.. అందుకే తనకు సిట్ నోటీసులు ఇవ్వలేదని తెలిపారు. బండి సంజయ్‌కు సన్నిహితుడైన బోయినపల్లి ప్రవీణ్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయినట్లుగా భావిస్తున్నారు.
సిట్ బండి సంజయ్‌ను సాక్షిగా విచారించేందుకు 2025 జులై 24న హైదరాబాద్‌లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లో హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది, కానీ పార్లమెంట్ సమావేశాల కారణంగా ఆయన జులై 28కి సమయం కోరారు. అప్పుడు కూడా ఆయన తీరిక లేకుండా ఉండటంతో హాజరు కాలేకపోయారు. ఆగస్టు 8న మధ్యాహ్నం 3 గంటలకు హాజరు అవ్వాలని నిర్ణయించుకున్నారు.