Bandi Sanjay warning to Telangana politicians | హైదరాబాద్: తెలంగాణ రాజకీయ నేతలకు కేంద్ర హోం మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ హెచ్చరిక జారీ చేశారు. ఆయుధాలకు సంబంధించిన గ్రూపులకు మద్ధతిస్తూ కొందరు ప్రజాస్వామ్యం పేరుతో మాట్లాడుతున్నవారు.. వారు ఇప్పటికైనా తమ సంబంధాలను తెంచుకోవాలని హెచ్చరించారు. లేనిపక్షంలో మావోయిస్టులు, ఆయుధ గ్రూపులతో సంబంధాలను బహిర్గతం చేస్తామని బండి సంజయ్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

Continues below advertisement


కేంద్ర ప్రభుత్వం అన్నీ గుర్తిస్తుంది..


మావోయిస్టు కేడర్ల వద్దే కాకుండా, అవినీతి, నేరపరమైన కార్యకలాపాలు చేస్తున్న నేతలు.. తీవ్రవాద సంబంధాలను కాపాడుకునే వారిని కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో దేశ భద్రత కోసం కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కొందరు నేతలకు మావోయిస్టులు, నక్సలైట్ల గ్రూపులతో సంబంధాలు ఉన్నాయని ఇటీవల మహారాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ రావు తెలిపిన వార్తలు న్యూస్ పేపర్లలో వచ్చాయి. 


నేతలు మావోయిస్టులతో సంబంధాలు తెంచుకోవాలి


తెలంగాణకు చెందిన కొందరు నేతలకు మావోయిస్టులతో లింకులు ఉన్నాయని, ఆయుధాలకు సంబంధించిన గ్రూపులతోనే సంబంధాలు ఉన్నాయని మావోయిస్టులు తెలిపారన్న కథనాలపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. మావోయిస్టులు, ఆయుధాలు కలిగి ఉన్న గ్రూపులు, గ్యాంగ్స్, దేశ భద్రతకు విఘాతం కలిగించేలా వ్యవహరించేవారు ఎవరైనా సరే, ఎంత పెద్ద నాయకులైనా కఠిన చర్యలు తప్పవని బండి సంజయ్ హెచ్చరించారు.






మావోయిస్ట్ టాప్ కమాండర్ హిడ్మా సైతం తెలంగాణలోనే తలదాచుకున్నాడని కథనాలు వచ్చాయి. ఛత్తీస్ గఢ్ వదిలి తన 250 మంది అనుచరులతో కలిసి మాడవి హిడ్మా తెలంగాణకు వచ్చాడని సమాచారం. వందల మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోతున్న సమయంలో ఇంకా హిడ్మా లాంటి కొందరు టాప్ మావోయిస్టుల కోసం పోలీసులు, భద్రతా బలగాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని హోం మంత్రి అమిత్ షా చెప్పిన మాటలకు అనుగుణంగానే అడవులను జల్లెడ పడుతున్నాయి బలగాలు.