Ask  Kavitha :  రాజకీయ నేతలు సోషల్ మీడియాలో ప్రజలతో టచ్‌లో ఉండటం కామన్‌గా జరుగుతోంది. ఇటీవలి కాలంలో ప్రత్యేకంగా ప్రశ్న- జవాబు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత ఆస్క్ మీ పేరుతో పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సూటి ప్రశ్నలు ఎదురైనా తనదైన పద్దతిలో సమాధానాలిచ్చారు. ఓ నెటిజన్ ఢిల్లీ లిక్కర్ స్కాంలో మీ పాత్రేమిటో సూటిగా చెప్పాలన్నారు. అయితే తనకే తెలియదని..అందులో అసలు తన పాత్రే లేదని కవిత సూటిగా స్పష్టం చేశారు. 


 





 


మహిళా రిజర్వేషన్లపై పోరాడామని చెప్పుకుంటారని కానీ మీ పార్టీలో ఎందుకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించలేదని ఓ నెటిజన్ ప్రశ్నించారు. వెంటనే చట్టం చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారని..కానీ బీజేపీనే చేయలేదని కవిత గుర్తు చేశారు.   





 


వచ్చే తెలంగాణ ఎన్నికల్లో హంగ్ వస్తుందని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయని ఓ నెటిజన్ అడిగారు. అయితే కవిత మాత్రం ఇవన్నీ కాంగ్రె్స మార్క్ ప్రచారాలని గత ఎన్నికల్లోనూ అలాగే ప్రచారం చేశారన్నారు. ఈ సారి కూడా వంద శాతం బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందన్నారు.   





 


తెలంగాణ  బీసీ సీఎం నినాదంపైనా ఒకరి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బీసీ స్టేట్ చీఫ్‌ను తీసేసి ఓసీకి పదవి ఇచ్చారని.. బీసీ కులగణన కూడా చేపట్టడం లేదని గుర్తు చేశారు. మహిలా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు  రిజర్వేషన్లపైనా స్పందించలేదన్నారు. ఇది ఒక ఎలక్షన్ జిమ్మిక్కేనని కవిత స్పష్టం చేశారు. 


 





 


బీఆర్ఎస్‌కు 95 నుంచి 105  సీట్లు వస్తాయని .. ఫలితాలపై ఎంత నమ్మకం ఉందని ప్రశ్నించిన ఓ నెటిజన్‌కు రిప్లై ఇచ్చారు.    చంద్రబాబు అరెస్ట్ పై అభిప్రాయం అడిగిన ఓ నెటిజన్ కూ సమాధానం ఇచ్చారు.   ఈ వయసులో ్లఅలా జరగడం కరెక్ట్ కాదని.. వారి కుటుంబానికి సానుభూతి చూపుతానని అన్నారు. 


 





 


 


రాజకీయాల్లో తాను పావుగా మారడం కంటే రాణిగా ఉండటానికే ఇష్టపడతానని...తనపై ఇతరులు చేస్తున్న కామెంట్లను ప్రస్తావిస్తూ ఓ నెటిజన్  అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 


 





 


యువత రాజకీయాల్లోకి రావాలని.. రాజకీయం పార్ట్ టైం జాబ్ కాదని కవిత ఓ నెటిజన్ సందేశం ఇవ్వాలని అడిగితే సమాధానం  ఇచ్చారు.