Kumuram Bheem Asifabad: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో ఆదివాసి మహిళపై అత్యాచారం చేసిన నిందితుడిని ఉరితీయాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ అన్నారు. నిందితుడి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మొకానికి నల్ల రిబ్బన్లు ధరించి మౌనంగా ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఎస్పీ జీవన్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టాలని కోరారు. ఆదివాసులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలన్నారు. 


ఆదిలాబాద్ జిల్లాతో పాటు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆన్ని మండలాలలో ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో మహిళలు పెద్దఎత్తున భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. స్ధానిక పొలీస్ స్టేషన్ లలో వినతి పత్రం అందజేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా నిందితున్ని వెంటనే ఉరి శిక్ష అమలయ్యేలా పాస్టర్ ఫోటోలు ఏర్పాటు చేయాలన్నారు అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎలాంటి అవంతికలను చోటు చేసుకోకుండా తమ ఏజెన్సీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్టం పూర్తిగా అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారన్నారు.


1970 తరువాత జైనూరు మండలంలో వలస వచ్చిన మైనారిటీలను వెంటనే ఇక్కడి నుంచి మదన ప్రాంతానికి తరలించేలా ప్రభుత్వం స్వరా తీసుకోవాలన్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా  పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.