KCR Delhi Tour :   ఢిల్లీలో నిర్మించిన బీఆర్‌ఎస్‌  నూతన కార్యాలయాన్ని మే 4న అట్టహాసంగా ప్రారంభించనున్నారు.  బీఆర్‌ఎస్‌గా మారిన అనంతరం పార్టీ కార్యకలాపాలకు జాతీయస్థాయిలో కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో ఢిల్లీలో శాశ్వత కార్యాలయాన్ని నిర్మించారు. జాతీయస్థాయి పార్టీ కార్యకలాపాలన్నీ కేంద్ర కార్యాలయం నుంచి నడువనున్నాయి. వివిధ పార్టీలను ఒకే వేదిక మీదికి తీసుకురావడం, సదస్సులు, సమావేశాలకు పార్టీ కార్యాలయం ఒక వేదికగా పనిచేస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందు కోసం కేసీఆర్ మంగళవారం ఢిల్లీ బయలుదేరాల్సి ఉంది. అయితే  బుధవారం రోజున కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు.


మంగళవారం ఢిల్లీకి వెళ్లి..  అక్కడ  వసంత్  విహార్ లో నిర్మించిన సెంట్రల్ పార్టీ కార్యాలయ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించాల్సి ఉంది.   మే 4న   పార్టీ కార్యలయాన్ని ప్రారంభించనున్నట్లుగా కేసీఆర్  ఇప్పటికే ప్రకటించారు.  జాతీయ స్థాయి బీఆర్ఎస్ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే జరగనున్నాయి. పార్టీ ప్రారంభోత్సవం తర్వాత తిరిగి హైదరాబాద్ కు రానున్నారు. అప్పటి వరకు కేసీఆర్  ఢిల్లీలోనే ఉండనున్నారు.బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం చేయనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమలో మంత్రులు, ఎమ్మెల్యేలు సహా 200 మంది ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.  ఢిల్లీలోని వసంత్ విహార్ లో  2021 సెప్టెంబర్ లో  భవనానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఇపుడు పూర్తి చేసి ప్రారంభిస్తున్నారు.


బీఆర్ఎస్ పార్టీ కోసం తొలుత ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో తాత్కాలిక కార్యాలయాన్ని డిసెంబర్ 14న కేసీఆర్ ప్రారంభించారు. ఇది కేవలం ఒక గుర్తింపు కోసం మాత్రమే ఏర్పాటు చేసినట్లు అప్పుడే పార్టీ వర్గాలు వివరించాయి. తాజాగా శాశ్వత భవనం పూర్తి కావడంతో మే 4న అట్టహాసంగా పార్టీ కార్యాలయం ప్రారంభించాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభిస్తారు. బీఆర్ఎస్ జాతీయ స్థాయి కార్యకలాపాలన్నీ కేంద్ర కార్యాలయం నుంచే నడువనున్నాయి. వివిధ పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకొని రావడం, సదస్సులు, సమావేశాలు నిర్వహించడానికి పార్టీ కార్యాలయాన్ని ఉపయోగించనున్నారు. ఇకపై ఢిల్లీలోని కేంద్ర కార్యాలయం అనేక జాతీయ స్థాయి చర్చలకు వేదికగా పని చేయనున్నది.  


 ఢిల్లీ పర్యటన అనంతరం కేసీఆర్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ తరఫున  ప్రచారంలో పాల్గొంటారని చెబుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ తరపున ప్రచారం చేసేందుకు రావు బహుశా అక్కడికి వెళ్లే అవకాశం ఉందని పార్టీ అంతర్గత సమాచారం. కేసీఆర్‌ను జేడీఎస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కర్ణాటకలో తమ పార్టీకి ప్రచారం చేయాల్సిందిగా కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. అయితే కేసీఆర్ ప్రచార షెడ్యూల్‌ ఇంకా ఖరారు కాలేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కేసీఆర్ ఢిల్లీ  పర్యటన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం  ఉందని తెలిపాయి.