Breaking News: బీజేపీ రైతు రాబందు పార్టీ : సీఎం కేసీఆర్

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నవంబర్ 30న జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 29 Nov 2021 07:29 PM

Background

తిరుమల శ్రీవారి ఆలయం ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి కన్నుమూశారు. గుండెపోటు రావడంతో డాలర్ శేషాద్రి కన్నుమూశారని సమాచారం. కార్తీక దిపోత్సవంలో పాల్గొనేందుకు ఆయన విశాఖపట్నం వెళ్లారు. అక్కడ ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో డాలర్ శేషాద్రి తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు. డాలర్‌...More

గుత్తివారిపల్లి పొలాల్లో మరణించిన చిరుత పులి... 

చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం గుత్తివారిపల్లి గ్రామం సమీపంలో వ్యవసాయ పొలాల్లో చిరుత పులి మరణించింది. చనిపోయిన చిరుత పులిని గొర్రెల కాపరులు గుర్తించి అటవీ శాఖ అధికారులకి‌ సమాచారం అందించారు. గత పది రోజుల నుంచి చుట్టు పక్కల గ్రామాల ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న చిరుత పులి చనిపోవడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. అటవీ సమీపంలో గ్రామం ఉన్నందున ఆవులు, గొర్రెల కాపరులు పొలాల్లో పని చేస్తున్న రైతులు జాగ్రత్త వహించాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.