Breaking News Live: హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 8న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 08 Oct 2021 08:50 PM
హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో భారీ వర్షం కురుస్తోంది. దిల్ సుఖ్ నగర్, బీఎన్ రెడ్డి, గొల్కోండలో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. 


 


 

ముంబయి డ్రగ్స్ కేసు... ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ

డ్రగ్స్ కేసులో ముంబయి కోర్టు ఆర్యన్ ఖాన్ బెయిన్ పిటిషన్ ను తిరస్కరించింది. ఆర్యన్ తో మన్మూన్ ధామేచా బెయిల్  పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. 





తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 7 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగాయి. 37 గంటల 5 నిమిషాల చర్చ జరిగింది. ఈ సమావేశాల్లో 7 బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టంది. ఈ బిల్లులకు సభ పాస్ చేసింది. 

అఫ్ఘనిస్థాన్ లోని కుందుజ్ మసీదుపై ఆత్మాహుతి దాడి

అఫ్ఘనిస్థాన్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. కుందుజ్ లోని మసీదు లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో 100 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. 

ఎయిర్ ఇండియాను దక్కించుకున్న టాటా గ్రూపు

ఎయిర్ ఇండియాను టాటా సంస్థ దక్కించుకుంది. ఓపెన్ బిడ్ లో టాటా సన్స్ సంస్థ ఎయిర్ ఇండియాను దక్కించుకుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎయిర్ ఇండియా కోసం టాటా, స్పైస్ జెట్ బిడ్లు దాఖలు చేశాయి. 

తెలంగాణ శాసనమండలి నిరవధిక వాయిదా

తెలంగాణ శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. ఏడు రోజుల పాటు శాసనమండలి కొనసాగింది. 23 గంటల 32 నిమిషాల పాటు మండలిలో చర్చ జరిగింది. 

అసెంబ్లీలో పీవీ చిత్రపటం ఆవిష్కరణ

భారత మాజీ ప్రధాని, పీవీ నర‌సిం‌హా‌రావు చిత్రప‌టాన్ని శుక్రవారం అసెంబ్లీ లాబీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా అందరూ పీవీ చిత్రప‌టానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మె‌ల్సీలు, ఎమ్మె‌ల్యే‌లతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సుర‌భి వాణీదేవీ ఆమె కుటుంబ‌ స‌భ్యులు పాల్గొన్నారు.

వరంగల్ చేరుకున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వరంగల్‌ చేరుకున్నారు. ఆయన కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అక్కడి నుంచి ఆయన కాసేపట్లో హుజూరాబాద్‌కు వెళ్లనున్నారు. బల్మూరి వెంకట్ నామినేషన్‌ వేసే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు.

యాచకురాలికి మంత్రి కేటీఆర్ సాయం

హైదరాబాద్‌లో ఓ అభాగ్యురాలి దీన స్థితి మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. చాదర్‌ఘాట్‌ సర్కిల్‌ వద్ద రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై ఓ యాచకురాలు చిన్నారితో అత్యంత దీన స్థితిలో పడుకొని ఉండడాన్ని ఓ వ్యక్తి ట్వీట్ చేస్తూ మంత్రికి ట్వీట్ చేశాడు. దీంతో ఆమెకు ఏదైనా సాయం చేయాలని చార్మినార్ జోనల్ కమిషనర్‌‌కు ట్యాగ్ చేస్తూ రీట్వీట్ చేశారు. వారిని సమీపంలోని నైట్‌ షెల్టర్‌కు తరలించాలని మంత్రి సూచించారు.





నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు

హుజూరాబాద్‌ ఉపఎన్నిక నామినేషన్ల గడువు ఇవాల్టితో ముగియనుంది. ఈనెల 11న నామినేషన్లను పరిశీలించనున్నారు. 13న నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఈనెల 30న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌ 2న ఓట్లను లెక్కించనున్నారు. ఫలితం కూడా అదే రోజు వస్తుంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున గెల్లు శ్రీనివాస్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ ఇవాళ నామినేషన్ వేయనున్నారు. మరోవైపు, ఏపీలో బద్వేల్ ఉప ఎన్నిక నామిషన్ల గడువు కూడా ఇవాల్టితోనే ముగియనుంది. 

మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్లకు పోలీసుల నోటీసులు

గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. చింతలపూడిలోని నరేంద్ర ఇంటికి వెళ్లి కాకినాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు. గతంలో డ్రగ్స్‌ రవాణా అంశంలో ప్రభుత్వంపై ధూళిపాళ్ల నరేంద్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కాకినాడ పోర్టులో తగలబడిన బోటులో డ్రగ్స్ ఉన్నాయంటూ ధూళిపాళ్ల విమర్శలు చేశారు. ఆ వ్యవహారంలో విచారణకు వచ్చి తగిన ఆధారాలు ఇవ్వాలని ధూళిపాళ్లకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Background

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 8న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.