Telangana AP Live News: కార్వీ సంస్థ ఎండీ అరెస్టు.. పార్థసారథిపై భారీ అభియోగాలు!

విజయవాడలో కారులో డెడ్‌బాడీ కలకలం రేపింది. మొగల్రాజపురం మానర్ ప్లాజా ఎదురుగా ఉన్న రోడ్డులో పార్క్ చేసిన ఫోర్డ్ కారులో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

ABP Desam Last Updated: 19 Aug 2021 02:55 PM

Background

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ.సుబ్బారెడ్డి సహా ఇతర అధికారులు కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా తగ్గుముఖం పట్టాలని స్వామివారిని ప్రార్థించినట్టు కిషన్...More

మొహర్రం: రేపు హైద‌రాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు

మొహర్రం సందర్భంగా రేపు (ఆగస్టు 20) ఉద‌యం 11 గంట‌ల‌ నుంచి రాత్రి 9 గంటల వరకు హైద‌రాబాద్ వ్యాప్తంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించ‌నున్నారు. రేపు హైద‌రాబాద్‌లోని డబీర్‌పురాలోని బీబీ కా ఆలం నుంచి చాదర్‌ఘాట్ వరకు ఊరేగింపు జ‌ర‌గ‌నుంది. హైద‌రాబాద్‌లో మొహర్రం సన్నాహాలపై పోలీసులతో హైద‌రాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్ వ‌ర్చువ‌ల్ విధానంలో మాట్లాడారు. రేపు హైద‌రాబాద్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చ‌ర్చించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల‌ని చెప్పారు. ప్రజలు క‌రోనా నిబంధనలు ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలని ఆయ‌న అన్నారు. పోలీసులకు ప్రజ‌లు సహకరించాలని కోరారు.