Big Breaking News Live: లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనపై విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 6న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 06 Oct 2021 10:17 PM
లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనపై విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు

సంచలనం రేపిన యూపీ లఖింపూర్ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. యూపీ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సీబీఐతో దర్యాప్తు జరిపించాలని యూపీకి చెందిన ఇద్దరు లాయర్లు శివకుమార్ త్రిపాఠి, సీఎస్ పాండా సీజీఐ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు. ఈ క్రమంలో సీజేఐ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ హింసాత్మక ఘటనపై విచారణ చేపట్టనుంది.

ఓఆర్ఆర్ నుంచి మన్నెగూడకు 4 లేన్ల రోడ్డు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం

హైదరాబాద్ (ఔటర్ రింగ్ రోడ్డు అప్పా జంక్షన్) నుంచి మన్నెగూడకు 4 లేన్ల రోడ్డు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రూ.928.41 కోట్ల నిధులు కేటాయించినట్లు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. 


 





అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చాలా అసహనంతో వ్యవహరిస్తున్నారు.. దుబ్బాక ఎమ్మెల్యే విమర్శలు

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు లేనంతగా అసెంబ్లీలో చాలా అసహనంతో వ్యవహరిస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. హనుమకొండలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తనపై వెటకారంగా మాట్లాడుతున్నారని తెలిపారు. దళితబంధు పథకాన్ని బీజెపీ స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. దళితబంధు పథకం నిర్ణయం మంచిదేనని, అయితే ఆచరణ తీరు గురించి ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు ట్రోల్ చేస్తున్నారని చెప్పారు. హామీ ఇచ్చినట్లుగా దళితులకు సీఎం కేసీఆర్ 3 ఎకరాలు ఇప్పటికీ ఇవ్వకపోవడం సిగ్గుచేటు అన్నారు. దళింతులందరికి పది లక్షలు రూపాయలు ఇచ్చే వరకు బీజెపీ పోరాటం చేస్తుందని చెప్పారు.

  MAA Elections: నా ఫొటోలు మార్ఫింగ్ చేశారు.. నరేశ్, కరాటే కల్యాణిపై హేమ ఫిర్యాదు

మా ఎన్నికల అధికారికి నటి హేమ లేఖ రాశారు. తనపై దుష్ర్పచారం చేశారని ఆరోపించారు. ఈ మేరకు నరేశ్, కరాటే కల్యాణిపై మా ఎన్నికల అధికారి ఫిర్యాదు చేశారు. తన ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఏపీ ఆర్జీయూకేటీ సెట్‌-2021 ఫలితాలు విడుదల

ఏపీ ఆర్జీయూకేటీ సెట్‌-2021 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఒంగోలులో విడుదల చేశారు.

హెటిరో కార్యాలయాలపై ఐటీ అధికారుల సోదాలు

హెటిరో డ్రగ్స్ సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు మరో 3 ప్రాంతాల్లో సోదాలు ఏకకాలంలో జరుగుతున్నాయి. హెటిరో ప్రధాన కార్యాలయం సహా డైరెక్టర్లు, సీఈవో ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతుండగా.. ఆదాయపన్ను శాఖ బృందాలు 20 వరకూ సోదాల్లో పాల్గొన్నాయి.

పెద్దపల్లి: లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు

పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. భూపాలపల్లి వైపు ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు మంథని దాటాక ఎత్తుగా ఉన్న రోడ్డు నుంచి వెళుతూ లోయలో పడింది. బస్సులో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. బెల్లంపల్లి నుంచి హనుమకొండకు వెళ్తున్న పరకాల డిపో బస్సు కారును ఢీకొని అదుపు తప్పి రోడ్డు పక్కన లోయలో పడింది. ప్రమాదంలో కారులో ఉన్న ఖాన్‌సాయి పేటకు చెందిన వినీత్‌ అనే వ్యక్తి మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మరో 16 మంది స్వల్పంగా గాయపడ్డారు. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Background

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 6న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.