Breaking News: నీట్-2021 ఫలితాలు విడుదల  

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరగనున్న వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 01 Nov 2021 09:14 PM

Background

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నేడు (నవంబర్‌ 1) ఘనంగా నిర్వహించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్‌19 నిబంధనలతో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్...More

నీట్ ఫలితాలు విడుదల  

దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్‌-యూజీ 2021 ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాల ప్రకటనకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సోమవారం రాత్రి నీట్‌ ఫలితాలు విడుదల చేసింది. సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన మరుసటి రోజే ఫైనల్‌ కీ, పరీక్ష ఫలితాలు విడుదల అవుతాయని విద్యార్థులు భావించారు. ఎన్‌టీఏ అధికారులు సోమవారం ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలను http://neet.nta.nic.in/ వెబ్‌సైట్‌లో పొందవచ్చు.